12 Years for Magadheera | చిరుత ( Chiruta ) సినిమాతో అద్భుతమైన విజయం అందుకున్న రామ్ చరణ్ ( Ramcharan ).. రెండో ప్రయత్నంలో ఏకంగా ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాశాడు. మెగాస్టార్ ( Mega star ) నట వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చిన మెగా తనయుడు.. మగధీర ( Magadheera )తో ఏకంగా సౌత్ సినిమా రికార్డులను తిరగరాశాడు. అప్పటివరకు తెలుగు సినిమా కలలో కూడా చూడని కలెక్షన్లు మనకు పరిచయం చేశాడు రాజమౌళి ( Rajamouli ). పునర్జన్మ నేపథ్యంలో రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా 2009 జూలై 31న విడుదలైంది. 40 కోట్ల బడ్జెట్తో అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించాడు. అప్పట్లో ఈ సినిమాకు భారీ బడ్జెట్ పెట్టారు అని చాలా మంది విమర్శించినా కూడా.. అనుకున్నది చేసి చూపించాడు రాజమౌళి. బాక్సాఫీసు ( Box Office ) వద్ద 80 కోట్ల కలెక్షన్లు వసూలు చేసి బాలీవుడ్ కూడా బిత్తరపోయేలా చేశాడు మగధీర.
నైజాం-22.20 కోట్లు
సీడెడ్-13.00 కోట్లు
ఉత్తరాంధ్ర-5.90 కోట్లు
ఈస్ట్-4.32 కోట్లు
వెస్ట్-4.13 కోట్లు
గుంటూరు-5.18 కోట్లు
కృష్ణా-3.63 కోట్లు
నెల్లూరు-3.30 కోట్లు
ఏపీ + తెలంగాణ-61.66 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా-8.30 కోట్లు
ఓవర్సీస్-3.50 కోట్లు
తెలుగు వెర్షన్-73.46 కోట్లు
తమిళ్+మలయాళం-4.50 కోట్లు
వరల్డ్ వైడ్ టోటల్-77.96 కోట్లు
మగధీర చిత్రానికి కేవలం 40.42 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇన్ని కోట్లు వసూలు చేస్తుందా అనే అనుమానాలకు తెరదించుతూ.. 77.96 కోట్ల షేర్ ను తీసుకొచ్చింది. ఈ చిత్రం బయ్యర్లకు 37.54 కోట్ల భారీ లాభాలు దక్కాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
అభిమానులకు షాక్.. సోషల్ మీడియాలో అక్కినేని పేరు తీసేసిన సమంత
Sumanth Malli Modalaindi | సుమంత్ ‘మళ్లీ మొదలైంది’ ఫస్ట్ లుక్
Review : తిమ్మరుసు సినిమా ఎలా ఉందంటే..
రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన సుమంత్.. దేవుడు, దెయ్యాలకు థ్యాంక్స్ చెప్పిన ఆర్జీవీ
సిల్క్ స్మితను కొట్టే ఆడది లేదు.. శ్రీదేవి కూడా ఆమెనే ఫాలో అయ్యేది.. బాలయ్య సంచలన వ్యాఖ్యలు