టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ రామాయణం 25ఏళ్లు పూర్తి చేసుకుంది. బాలనటుడిగా ఈసినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు తారక్. గుణశేఖర్ డైరక్షన్ లో వచ్చిన ఈసినిమా జాతీయఅవార్డ్ గెలుచుకోవడం విశేషం. రామాయణం సినిమాతో ఎన్టీఆర్ సినీ కెరీర్ స్టార్ట్ అయ్యింది. ఈ సినిమాలో రామయ్యగా అద్భుతంగా నటించిన జూనియర్ ని తాతకు తగ్గ మనవడిగా తెలుగు ప్రేక్షకులు ఆదరించారు.
ఇక మహేష్ బాబు నటించిన యువరాజు సినిమా కూడా వచ్చి 21 ఏళ్లు అయ్యింది. వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన ఈసినిమాతో మహేష్ బాబు టాలీవుడ్ ప్రిన్స్ గా ప్రేక్షకుల మనసులో నిలిచాడు.