శుక్రవారం 04 డిసెంబర్ 2020
Cinema - Oct 30, 2020 , 13:15:16

మంగ్లీ పాట‌కు అదా శ‌ర్మ అదిరిపోయే స్టెప్పులు..!

మంగ్లీ పాట‌కు అదా శ‌ర్మ అదిరిపోయే స్టెప్పులు..!

అదాశర్మ కథానాయికగా శ్రీ కృష్ణ క్రియేషన్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘క్వశ్చన్‌మార్క్‌(?)’ . విప్రా ద‌ర్శ‌క‌త్వంలో గౌరీకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం హార‌ర్ క‌థాంశంతో రూపొందుతుంది.  క్వశ్చన్‌మార్క్‌ వెనకున్న కథేమిటన్నది ఉత్కంఠను పంచుతుంది. తన జీవితంలోని శేషప్రశ్నలకు సమాధానం కోసం అన్వేషిస్తూ ఓ యువతి సాగించే ప్రయాణమే ఈ చిత్ర ఇతివృత్తం అని అదాశ‌ర్మ పేర్కొంది

‘హైదరాబాద్‌తో పాటు మహారాజపురం అడవుల్లో  చిత్రీక‌ర‌ణ జ‌రుపుకున్న ఈ చిత్ర టైటిల్‌కు మంచి స్పంద‌న వ‌స్తుంది. తాజాగా చిత్రం నుండి రామస‌క్క‌నోడివిరా పిల‌గ అనే  సాంగ్ వీడియో విడుద‌ల చేశారు. మంగ్లీ పాడిన ఈ పాట‌కు ర‌ఘుకుంచె సంగీతం అందించారు. ఈ పాట సంగీత ప్రియుల‌ని రంజింపజేస్తుంది.