రవితేజ కథానాయకుడిగా శరత్ మండవ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రానికి ‘రామారావు ఆన్ డ్యూటీ’ అనే పేరును ఖరారు చేశారు. ఎస్ఎల్వీ సినిమాస్, ఆర్టీ టీమ్ వర్క్స్ పతాకాలపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను సోమవారం విడుదల చేశారు. ఈ పోస్టర్స్‌లో రవితేజ ైస్టెలిష్‌గా కనిపిస్తున్నారు. అతడి బ్యాక్‌గ్రౌండ్‌లో ప్రభుత్వ కార్యాలయం ఉండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. బి. రామారావుగా ప్రమాణ స్వీకారం చేసిన లేఖను జత చేస్తూ వినూత్నంగా ఫస్ట్‌లుక్‌ను రూపొందించారు. నిర్మాత మాట్లాడుతూ ‘వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిస్తున్న థ్రిల్లర్ చిత్రమిది. ఇందులో రవితేజ నిజాయితీపరుడైన ప్రభుత్వ ఉద్యోగి పాత్రలో కనిపించబోతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుతున్నాం రవితేజ, దివ్యాంశకౌశిక్తో పాటు ప్రధాన తారాగణంపై కీలక ఘట్టాలను చిత్రీకరిస్తున్నాం’ అని తెలిపారు. నాజర్, వి.కె.నరేష్, పవిత్రాలోకేష్, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శ్యామ్ సీఎస్, సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్.