మంగళవారం 20 అక్టోబర్ 2020
Cinema - Oct 18, 2020 , 08:33:55

వ‌చ్చే వారంలోనే భీమ్ నుండి స‌ర్‌ప్రైజ్ రానుంది

వ‌చ్చే వారంలోనే భీమ్ నుండి స‌ర్‌ప్రైజ్ రానుంది

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్.  ఈ చిత్రంలో తార‌క్ లుక్ ఎలా ఉంటుంది, ఆయ‌న పాత్ర‌ను జ‌క్క‌న్న ఏ విధంగా తీర్చిదిద్దాడు అని తెలుసుకోవాల‌ని అభిమానులు కొన్ని  నెలలుగా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తూ వ‌స్తున్నారు. అయితే శ‌నివారం రాత్రి ఆర్ఆర్ఆర్ టీం ఎన్టీఆర్ అభిమానుల‌కి  గుడ్ న్యూస్ చెప్పింది. మ‌రో ఐదు రోజుల‌లో భీమ్ కోసం రామ‌రాజు స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్ తేనున్నాడు అని స‌రికొత్త పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. 

చరిత్ర, ఫిక్షన్‌ అంశాల కలబోత ఆధారంగా రాజ‌మౌళి రౌద్రం రణం రుధిరం( ఆర్ఆర్ఆర్) అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. తెలంగాణ వీరుడు కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా  రామ్‌చరణ్ నటిస్తోన్న ఈ సినిమాలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్ దేవగన్, శ్రియ కీలకపాత్రలు పోషిస్తున్నారు. వ‌చ్చే ఏడాది విడుద‌ల కానున్న ఈ చిత్ర షూటింగ్ మార్చి నుండి క‌రోనా వ‌ల‌న ఆగిపోయింది. రీసెంట్‌గా తిరిగి షూటింగ్ ప్రారంభించారు. ఎన్టీఆర్‌కి సంబంధించిన స‌న్నివేశాల‌తో తాజా షెడ్యూల్ జ‌రిపారు. దాదాపు ఏడు నెలల విరామం తర్వాత ఈ సినిమా షూటింగ్‌ ఆరంభం కాబోతుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. డీవీవీ దాన‌య్య చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ ప్రేమ కోసం ఒలివియా తమ దేశం పైన, తన తల్లిదండ్రుల పైనే పోరాడుతుందట. చివరికీ ఎన్టీఆర్ మీద ప్రేమతోనే భారత దేశం కోసం ప్రాణాలు ఇస్తుందని.. ఎన్టీఆర్ – ఒలివియా ట్రాక్ కొత్తగా ఉంటుందని తెలుస్తోంది


logo