ఆదివారం 01 నవంబర్ 2020
Cinema - Sep 19, 2020 , 14:48:30

రిజ‌ర్వ్ ఫారెస్ట్ లో రాజ‌మౌళి దంప‌తులు

రిజ‌ర్వ్ ఫారెస్ట్ లో రాజ‌మౌళి దంప‌తులు

టాలీవుడ్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి క‌ర్ణాట‌క యాత్ర‌లో బిజీబిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. క‌ర్ణాట‌క ఛామ‌రాజ‌న‌గ‌ర్ జిల్లాలోని ప్రాచీన‌ హిమ‌వ‌ద్ గోపాల‌స్వామి టెంపుల్ ను సంద‌ర్శించారు. ఆల‌యంలో దంప‌తులిద్ద‌రూ ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. కొన్ని రోజులుగా మైసూర్, కొడ‌గు ప్రాంతాల సంద‌ర్శన‌లో ఉన్నారు. ఇంట‌ర్నేష‌న్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న స్టార్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళిని త‌మ కెమెరాల్లో బంధించేందుకు పోటీప‌డుతున్నారు అభిమానులు. కొన్ని ఫొటోలు ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

తాజాగా ర‌మారాజ‌మౌళి దంపతులు బందిపూర్ నేష‌న‌ల్ రిజ‌ర్వ్ ఫారెస్ట్ కు వెళ్లిన ఫొటో నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొడుతోంది. అయితే ఈ క‌పుల్ ఇద్ద‌రూ టూర్ కోసం రిజ‌ర్వ్ ఫారెస్ట్ వెళ్లారా..?  లేదా ఆర్ఆర్ఆర్ మూవీ లొకేష‌న్ల వేట కోసం వెళ్లారా..అంటూ తెగ ఆలోచిస్తున్నారు ఫాలోవ‌ర్లు. అయితే ఒక‌వేళ లొకేష‌న్ల అన్వేష‌ణ నిజ‌మే అయినా..షూటింగ్స్ కు రిజ‌ర్వ్ ఫారెస్ట్ లో అనుమ‌తించే అవ‌కాశం లేదు. లాక్ డౌన్ తో నిలిచిపోయిన ఆర్ఆర్ఆర్ షూటింగ్ వ‌చ్చే నెల‌లో రీస్టార్ట్ కానుంది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.