ఆదివారం 07 జూన్ 2020
Cinema - Mar 31, 2020 , 22:27:55

మారుతి దర్శకత్వంలో

మారుతి దర్శకత్వంలో

‘ఇస్మార్ట్‌శంకర్‌'తో కెరీర్‌లో పెద్ద విజయాన్ని అందుకున్నారు హీరో రామ్‌. మాస్‌ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంలో రామ్‌ పాత్ర, నటన తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి.  ఈ సక్సెస్‌తో  కథాంశాల ఎంపికలో తన పంథాను మార్చుకోవాలని నిర్ణయించుకున్న ఆయన తాజాగా దర్శకుడు మారుతితో ఓ సినిమా చేయబోతున్నట్లు తెలిసింది. రామ్‌ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని కుటుంబ విలువలకు వినోదాన్ని జోడిస్తూ ప్రస్తుతం మారుతి ఓ కథను సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు  సమాచారం.  జీఏ-2 సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు తెలిసింది. జూన్‌లో సినిమా సెట్స్‌పైకిరానుందని చెబుతున్నారు. ప్రస్తుతం రామ్‌ ‘రెడ్‌' సినిమాలో నటిస్తున్నారు.  ఈ చిత్రానికి కిషోర్‌ తిరుమల వహిస్తున్నారు. logo