e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home సినిమా స్రవంతి రవికిషోర్‌కు పితృవియోగం

స్రవంతి రవికిషోర్‌కు పితృవియోగం

స్రవంతి రవికిషోర్‌కు పితృవియోగం

సినీ నిర్మాత స్రవంతి రవికిషోర్‌ తండ్రి, హీరో రామ్‌ తాతయ్య పోతినేని సుబ్బారావు (91) అనారోగ్య సమస్యలతో మంగళవారం ఉదయం విజయవాడలో తుదిశ్వాస విడిచారు. తాతయ్యతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని రామ్‌ భావోద్వేగానికి లోనయ్యారు. తమ కుటుంబం ఉన్నత స్థాయికి రావడానికి తాతయ్య ఎంతో కృషి చేశారని రామ్‌ గుర్తుచేసుకున్నారు. సుబ్బారావు రెండో సంతానమైన మురళీ తనయుడే హీరో రామ్‌.

మేకప్‌మెన్‌ గంగాధర్‌ కన్నుమూత

స్రవంతి రవికిషోర్‌కు పితృవియోగం

కొవిడ్‌ బారిన పడి మంగళవారం సీనియర్‌ మేకప్‌మెన్‌ గంగాధర్‌ కన్నుమూశారు. ఇరవై ఐదేళ్ల సినీ ప్రయాణంలో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు మేకప్‌మెన్‌గా పనిచేసిన ఆయన నంది అవార్డును అందుకున్నారు. తెలుగు, తమిళం, కన్నడతో పాటు బాలీవుడ్‌ హీరోలకు వ్యక్తిగత మేకప్‌మెన్‌గా వ్యవహరించారు. గంగాధర్‌ తనకు అత్యంత ఆప్తుడని, కుటుంబ సభ్యుడిని కోల్పోయిన బాధ కలుగుతుందని నిర్మాత బెక్కెం వేణుగోపాల్‌ అన్నారు. హీరోలు శ్రీవిష్ణు, విశ్వక్‌సేన్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తంచేశారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
స్రవంతి రవికిషోర్‌కు పితృవియోగం

ట్రెండింగ్‌

Advertisement