మంగళవారం 02 మార్చి 2021
Cinema - Jan 10, 2021 , 13:36:57

త్రివిక్ర‌మ్‌తో సినిమాపై రామ్ స్పంద‌న ఏంటి?

త్రివిక్ర‌మ్‌తో సినిమాపై రామ్ స్పంద‌న ఏంటి?

ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రంతో ప‌వ‌ర్‌ఫుల్ హిట్ కొట్టిన రామ్  అదే ఉత్సాహంతో రెడ్ అనే చిత్రాన్ని చేశాడు. కిషోర్ తిరుమల ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన‌  ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది. మాళ‌విక శ‌ర్మ, నివేదా పేతురాజ్ చిత్రంలో క‌థానాయిక‌లుగా న‌టించారు. ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన టీజ‌ర్, ట్రైల‌ర్స్ సినిమాపై భారీ అంచ‌నాలు పెంచాయి. పూర్తిగా సస్పెన్స్ థ్రిల్లర్ మాదిరి రెడ్ సినిమా తెరకెక్కింది.  ఇందులో రామ్ ద్విపాత్రాభినయం చేశాడు. ఒకటి సాఫ్ట్ క్యారెక్టర్ కాగా, మరొక‌టి మాస్ క్యారెక్టర్. మాస్ పాత్రను రామ్ ఓ రేంజ్ లో ఓన్ చేసుకున్నాడు.

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో అదిరిపోయే మాస్ ఇమేజ్ సంపాదించుకున్న రామ్ ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. రెడ్ ట్రైలర్ లో కూడా ఎక్కువగా మాస్ క్యారెక్టర్ ని ఎలివేట్ చేశాడు దర్శకుడు.  హత్యల చుట్టూ సాగే సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కింది.  ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆశ‌గా ఎదురు చూస్తున్నారు. అయితే రామ్ త‌న తదుపరి చిత్రంగా త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్నాడ‌ని కొద్ది రోజుల క్రితం వార్తలు రాగా, దానిపై క్లారిటీ ఇచ్చాడు. త్రివిక్రమ్‌తో అయితే  సినిమా ఉంటుందని చెప్పిన రామ్‌, ఎప్పుడు ఆ సినిమాను ఉంటుందనే విషయాన్నిఇప్పుడే చెప్ప‌లేన‌ని పేర్కొన్నాడు. ప్ర‌స్తుతం త్రివిక్రమ్.. ఎన్టీఆర్ సినిమాతో బిజీగా ఉండ‌గా, ఈ మూవీ షూటింగ్ పూర్తైన త‌ర్వాత రామ్‌తో సినిమా చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది.

ఇవి కూడా చ‌ద‌వండి

న‌టి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్..!

బిగ్ బాస్ వేదిక‌పై కంట క‌న్నీరు పెట్టుకున్న స‌ల్మాన్

త‌న పెళ్ళిపై ప్ర‌క‌ట‌న ఇచ్చిన బాలీవుడ్ హీరో

చైతూ, సాయి ప‌ల్ల‌వి 'ల‌వ్ స్టోరీ' టీజ‌ర్ విడుద‌ల‌

నాలో క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించాయి.. అన‌సూయ ట్వీట్‌

వైవా హ‌ర్ష నిశ్చితార్థం.. వైర‌ల్‌గా మారిన ఫొటోలు

వ‌కీల్ సాబ్ షూటింగ్ పూర్తి.. సంక్రాంతికి టీజ‌ర్VIDEOS

logo