శుక్రవారం 05 మార్చి 2021
Cinema - Jan 22, 2021 , 20:46:19

రామ్ నెక్ట్స్ సినిమా ఈ డైరెక్ట‌ర్‌తోనే..!

రామ్ నెక్ట్స్ సినిమా ఈ డైరెక్ట‌ర్‌తోనే..!

రెడ్ సినిమా స‌క్సెస్ తో ఫుల్ జోష్‌మీదున్నాడు టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని. కిశోర్ తిరుమ‌ల-రామ్ కాంబినేష‌న్ లో మూడోసారి వ‌చ్చిన ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద హిట్ టాక్‌తో ప్ర‌ద‌ర్శించ‌బ‌డుతూ మంచి క‌లెక్ష‌న్ల‌ను రాబడుతోంది. రామ్ మ‌రో క్రేజీ ప్రాజెక్టును లైన్ లో పెడుతున్న‌ట్టు ఫిలింన‌గ‌ర్ లో వార్త‌లు వ‌స్తున్నాయి. విజ‌య్‌-మోహన్ లాల్ కాంబోలో వ‌చ్చిన జిల్లా చిత్రంతో డైరెక్ట‌ర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఆర్టీ నీస‌న్‌. యాక్ష‌న్ క‌థాంశంతో రాసుకున్న స్టోరీని నీస‌న్ ఇటీవ‌లే రామ్ కు వినిపించగా..రామ్ కు స్క్రిప్ట్ బాగా న‌చ్చిందని తెలుస్తోంది‌.

ఇప్ప‌టికే ప్రీ ప్రొడక్ష‌న్ ప‌నులు కూడా షురూ అయిన‌ట్టు టాక్‌. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించి త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న కూడా రానుంద‌ట‌. ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రంతో మాస్ ఇమేజ్ ను సొంతం చేసుకుని ఉస్తాద్‌గా పిల‌వ‌బడుతున్న రామ్ త‌న‌లోని మాస్ యాంగిల్ ను మ‌రింత ప‌టిష్టం చేసుకునేందుకు సిద్ద‌మ‌వుతున్నాడు. ఈ వార్త నిజ‌మైతే రామ్ ఉంచి మ‌రో మాస్ ఎంట‌ర్ టైన‌ర్ ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌డం ఖాయ‌మ‌న్న‌మాట‌.

ఇవి కూడా చ‌ద‌వండి..

స‌లార్ లో హీరోయిన్ గా కొత్త‌మ్మాయి..!

సూర్య‌-బోయ‌పాటి కాంబోలో సినిమా..!

మ‌హేశ్ దుబాయ్ ట్రిప్ వెనుకున్న సీక్రెట్ ఇదే..!

మ‌హేశ్ బాబు స్కిన్ స్పెష‌లిస్ట్ ఈమెనే..!

ఈ శుక్రవారం కొత్త సినిమా రిలీజ్‌లు లేవు..కార‌ణ‌మేంటో ?

స‌మంతలా పూజాహెగ్డే హ్యాట్రిక్ కొట్ట‌నుందా..?

కీర్తిసురేశ్ లుక్ మ‌హేశ్‌బాబు కోసమేనా..?


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo