రెడ్‌కు రియల్ హీరో అతనే

‘మంచి సినిమాలు చేయాలనే తపన, తాపత్రయం నిర్మాత రవికిషోర్‌లో ఎప్పుడూ కనిపిస్తుంది. ఆయనలాంటి సంస్కారవంతులు సినిమాలు తీయడం ఆపకూడదు. ఆయన మరిన్ని గొప్ప విజయాల్ని సాధించాలి’ అని అన్నారు దర్శకుడు త్రివిక్రమ్. రామ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘రెడ్'. కిషోర్ తిరుమల దర్శకుడు. స్రవంతి రవికిషోర్ నిర్మాత. నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానున్నది. మంగళవారం హైదరాబాద్‌లో ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన త్రివిక్రమ్ మాట్లాడుతూ ‘సిల్వర్‌స్క్రీన్‌పై రామ్ చలాకీగా ఎనర్జిటిక్‌గా కనిపిస్తాడు. భవిష్యత్తులో రామ్ ప్రయాణం అద్భుతంగా సాగాలి. స్క్రిప్ట్‌ను ఆసాంతం చదివే నిర్మాతల్లో రామానాయుడు తర్వాత రవికిషోర్లోనే ఆ లక్షణం గమనించా. రవికిషోర్‌గారు సినిమా జీవితాన్ని నాకు నేర్పించారు’ అని తెలిపారు. రామ్ మాట్లాడుతూ ‘హీరోగా నాకు కొత్త అనుభవాన్ని మిగిల్చింది. మాస్ సినిమాల్ని కిషోర్ తిరుమల చేయగలడని నిరూపించే చిత్రమిది. కరోనా సమయంలో వచ్చిన ఇబ్బందులను ఓర్చుకుంటూ ఈసినిమాను థియేటర్లలో విడుదలచేయడానికి పెదనాన్న ఎంతో శ్రమించారు. ఆయనే ఈ చిత్రానికి నిజమైన హీరో’ అని తెలిపారు. ఈ సినిమాలో తాను మహిమా అనే అమ్మాయిగా కనిపిస్తానని మాళవికాశర్మ చెప్పింది. కథ వినకుండా దర్శకుడిపై నమ్మకంతో తాను చేసిన సినిమా ఇదని నివేదా పేతురాజ్ పేర్కొన్నది. ఈ కార్యక్రమంలో అమృతా అయ్యర్, కిషోర్ తిరుమల పాల్గొన్నారు.
తాజావార్తలు
- తెలంగాణపై ప్రధాని మోదీ ప్రశంసలు
- ప్రదీప్ కోసం అనసూయ, రష్మి, శ్రీముఖి ప్రమోషన్స్
- కన్యాకుమారిలో శ్రీవారి ఆలయ రెండో వార్షికోత్సవం
- దావోస్ సదస్సులో ప్రసంగించనున్న మోదీ
- సుధీర్ బాబు లెగ్ వర్కవుట్స్..వీడియో వైరల్
- పసుపు రైతులను ఆదుకోవడంలో బీజేపీ, కాంగ్రెస్ విఫలం
- వివాహ విందు కోసం వచ్చి.. కానరాని లోకాలకు..!
- అమిత్ షా పదవికి రాజీనామా చేయాలి : రణదీప్ సూర్జేవాలా
- మీ పిల్లలకు రైస్ మిల్క్ తాగిస్తున్నారా!
- అన్‌లాక్ : తెరుచుకోనున్న స్విమ్మింగ్ పూల్స్