టాలీవు్డ్ హీరోలు రామ్ చరణ్, రామ్‌లు తమిళ దర్శకులు శంకర్,లింగుస్వామితో సినిమాలు చేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాని పలు సమస్యలు ఈ ప్రాజెక్టులు సెట్స్ పైకి వెళ్లకుండా అడ్డుపడుతున్నాయి. దర్శకుడు శంకర్‌కి.. లైకాతో ఇబ్బందులు ఉండడం వలన ఈ సినిమాపై సందేహాలు నెలకొన్నాయి. ఇక రామ్ సినిమాకు అడ్డుగా స్టూడియో గ్రీన్ సంస్థ అధినేత జ్ఞాన్ వేల్ రాజా ఉన్నారు.
లింగుస్వామికి, తనకు మధ్య సినిమాల పరంగా కొన్ని ఆర్థిక లావాదేవీలు పెండింగ్‌లో ఉన్నాయని, అవి తేలేవరకు మరో సినిమాలు చేయకుండా చూడాలని తెలుగు నిర్మాతల మండలిలో జ్ఞాన్వేల్ తెలుగు నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు. మా బేనర్లో సినిమా చేయకుండా వేరే సినిమా చేయడం మేము ఒప్పుకోం. మా బేనర్లో చేశాకే వేరే సినిమా చేయాలి అంటూ స్టూడియో గ్రీన్ సంస్థ అధినేత జ్ఞాన్ వేల్ రాజా పేర్కొన్నారు. దీనిపై లింగుస్వామి స్పందిస్తాడా అన్నది చూడాలి.