శుక్రవారం 05 జూన్ 2020
Cinema - May 20, 2020 , 23:37:57

రామరాజుతో కొమరం భీమ్‌

రామరాజుతో కొమరం భీమ్‌

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా నటిస్తున్న మల్టీస్టారర్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌'(రణం రౌద్రం రుధిరం). ఎస్‌.ఎస్‌.రాజమౌళి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. బుధవారం ఎన్టీఆర్‌ జన్మదినం సందర్భంగా  ఆయనతో కలిసి ఉన్న  ఆన్‌లొకేషన్‌ స్టిల్‌ను అభిమానులతో పంచుకున్నారురామ్‌చరణ్‌. ఈ ఫొటోను ఉద్దేశిస్తూ సెట్స్‌లో రామరాజు, భీమ్‌  అంటూ  చిత్రబృందం పేర్కొన్నది. నీరు, నిప్పుతో కూడిన ఎమెజీలను జోడించారు. ఇందులో రామ్‌చరణ్‌ భుజాలపై ఆప్యాయంగా చేతులు వేసి  ఎన్టీఆర్‌ కనిపిస్తున్నారు. చిరునవ్వులు చిందిస్తున్న ఈ కథానాయకులిద్దరి ఫొటో అభిమానుల్ని ఆకట్టుకుంటున్నది.  చిత్రబృందంతో పాటు తెలుగు సినీ ప్రముఖులంతా ఎన్టీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు అందజేశారు. ‘ఎన్టీఆర్‌ ఆన్‌స్క్రీన్‌, ఆఫ్‌స్క్రీన్‌ ఎనర్జీ  మా అందరిలో  సంతోషాన్ని నింపుతోంది. మీతో కలిసి సృష్టించిన ఈ అద్భుతాన్ని ప్రపంచానికి చూపించడానికి మేము ఆసక్తిగా  ఎదురుచూస్తున్నాం’  అని ‘ఆర్‌ఆర్‌ఆర్‌' యూనిట్‌ పేర్కొన్నది. ‘నీకు ఓ రిటర్న్‌ గిఫ్ట్‌ రుణపడి ఉన్నా. ఉత్తమమైన బహుమతినే అందిస్తానని మాటిస్తున్నా’ అంటూ తారక్‌కు రామ్‌చరణ్‌ శుభాకాంక్షలు అందించారు. ‘నా సినీ ప్రయాణం ప్రారంభమైన నాటి ఉంచి అందులో నువ్వు భాగమైనందుకు ఎంతో సంతోషిస్తున్నా’ అని రాజమౌళి...ఎన్టీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు అందజేశారు. ఎన్టీఆర్‌ పాత్రకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేయాలని చిత్రబృందం భావించింది. కానీ లాక్‌డౌన్‌ పొడగింపుతో విడుదలచేయలేకపోయింది. అలియాభట్‌, ఓలివియా మోరీస్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. 


logo