ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ ఇటీవలి కాలంలో సోషల్ మీడియా వేదికగా తెగ సందడి చేస్తున్న విషయం తెలిసిందే. లాక్డౌన్ సమయంలో టిక్‌టాక్ వీడియోలతో తెగ సందడి చేసిన వార్నర్ ఇప్పుడు స్వాపింగ్ వీడియోలతో రచ్చ చేస్తున్నాడు. సౌత్ సినీ పరిశ్రమకు చెందిన స్టార్స్ ఫేస్‌ని మార్ఫింగ్ చేస్తూ అందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు. వీటికి మంచి రెస్పాన్స్ వస్తుంది.
తాజాగా వినయ విధేయ రామ చిత్రంలోని రామ్ చరణ్ ఫైటింగ్ సన్నివేశానికి సంబంధించిన వీడియో షేర్ చేశాడు. ఇందులో రామ్ చరణ్ ఫేస్‌ని మార్ఫింగ్ చేసి తన ఫేస్ పెట్టాడు. చెర్రీ మాదిరిగా ఫైటింగ్స్ చేయడంతో పాటు డైలాగులు చెప్పి అభిమానులని కనువిందు చేస్తున్నాడు. ఈ వీడియో నెటిజన్స్‌కి మంచి వినోదాన్ని పంచుతుంది. కాగా, ఐపీఎల్ 2021 సీజన్లో డేవిడ్ వార్నర్ దారుణంగా విఫలమవ్వడంతో అతని కెప్టెన్సీపై వేటు వేసిన టీమ్‌మేనేజ్‌మెంట్ కేన్ విలియమ్సన్కు సారథ్య బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే.