ఆదివారం 07 మార్చి 2021
Cinema - Jan 16, 2021 , 15:54:00

రామ్‌ చరణ్‌, రోజా.. ఇద్దరూ ఇష్టపడేది ఆ హీరోనే

రామ్‌ చరణ్‌, రోజా.. ఇద్దరూ ఇష్టపడేది ఆ హీరోనే

మెగా ప‌వ‌ర్‌స్టార్‌ రామ్ చరణ్,  సీనియ‌ర్ న‌టి రోజా  ఈ ఇద్దరూ   ఒకే హీరోను ఇష్ట‌ప‌డుతున్నారు.    మెగా కుటుంబంలో  అంతమంది హీరోలుండగా తనకు మాత్రం బయట హీరోనే ఇష్టం అంటున్నాడు రామ్ చరణ్. మరోవైపు 100 సినిమాలకు పైగా నటించిన రోజా కూడా తను నటించిన హీరోల పేర్లు కాకుండా మరొకరి పేరు చెప్పుకొచ్చింది. ఈ ఇద్దరి మనసులు దోచిన ఆ హీరో ఎవరో కాదు.. మాస్ మ‌హారాజా రవితేజ. ఒక్క సినిమాలో కూడా ఆయనతో కలిసి హీరోగా నటించకుండానే ఆయనంటే పిచ్చి అని చెప్తుంది రోజా. 

కాకపోతే రోజా ఉన్న సినిమాల్లో రవితేజ కూడా సపోర్టింగ్ రోల్స్ చేసాడు. అప్పట్లో ఈ ఇద్దరూ కలిసి శంభో శివ శంభో, తిరుమల తిరుపతి వెంకటేశ, వీర లాంటి సినిమాల్లో కలిసి నటించారు.   రవితేజ   నటించిన‌ ప్రతీ సినిమాను వదలకుండా చూస్తానని.. ఒక్కటంటే ఒక్కటి కూడా మిస్ కాలేదని చెప్తుంది ఈ మాజీ హీరోయిన్. మాస్ రాజా నటన అంటే తనకు అంతగా ఇష్టమంటుంది ఈమె. ముఖ్యంగా స్క్రీన్ పై ఆయన చేసే కామెడీని ఎంజాయ్ చేస్తాన‌ని చెబుతోంది.  

క్రాక్ సినిమాను కూడా ఈమె అలాగే ఎంజాయ్ చేసింది. మరోవైపు  రోజా మాత్రమే కాదు రామ్ చరణ్‌కు కూడా రవితేజ అభిమాన హీరో.  మెగా కుటుంబంలో అంత మంది హీరోలుంటే.. తన తండ్రి మాదిరే సొంతంగా ఎదిగిన రవితేజనే అభిమానిస్తున్నాడు రామ్ చరణ్. తన అభిమాన హీరో రవితేజ నటించిన క్రాక్ సినిమాను ఫుల్   ఎంజాయ్ చేసానని రివ్యూ కూడా ఇచ్చాడు రామ్. ఈయన ఇచ్చిన రివ్యూ వైరల్ అయింది కూడా. క్రాక్ చూసిన తర్వాత చిత్ర యూనిట్ కు కూడా ఫోన్ చేసి అభినందనలు తెలిపాడ.   రోజా, రామ్ చరణ్ మాత్రమే కాదు ఇండస్ట్రీలో మరికొందరు సెలబ్రిటీస్ కూడా రవితేజను అభిమానిస్తుంటారు.

VIDEOS

logo