మంగళవారం 02 జూన్ 2020
Cinema - Mar 18, 2020 , 10:58:49

నా పుట్టిన‌రోజు వేడుక‌లు జ‌రుపుకోవ‌ద్దు: రామ్ చ‌ర‌ణ్‌

నా పుట్టిన‌రోజు వేడుక‌లు జ‌రుపుకోవ‌ద్దు: రామ్ చ‌ర‌ణ్‌

క‌రోనా భ‌యంతో స్కూల్స్‌, థియేట‌ర్స్‌, షూటింగ్స్‌, పెళ్ళిళ్ళు, ప‌లు వేడుక‌లు ఇలా ఒక‌టేంటి జ‌న‌స‌మూహంతో కూడిన ప్రాంతాల‌న్నీ క‌ర్ఫ్యూ విధించిన‌ట్టుగా మారుతున్నాయి. ఇక ప్ర‌తి ఏడాది ఘ‌నంగా జ‌రిగే హీరోల బ‌ర్త్‌డే వేడుకలు కూడా ఈ సారి ర‌ద్దు అవుతున్నాయి.  క‌రోనా విజృంభిస్తున్న నేప‌థ్యంలో హీరోలే స్వ‌యంగా రంగంలోకి దిగి త‌మ బ‌ర్త్ డే వేడుక‌ల‌ని జ‌ర‌పొద్దంటూ స్టేట్‌మెంట్స్ ఇస్తున్నారు.

ఇప్ప‌టికే మోహ‌న్ బాబు త‌న బ‌ర్త్‌డే వేడుక‌ల‌ని జ‌ర‌పొద్ద‌ని పిలుపునివ్వగా, తాజాగా రామ్ చ‌ర‌ణ్ లేఖ ద్వారా విన్న‌పాన్ని విన్న‌వించారు. మార్చి 27న త‌న పుట్టిన రోజు నేప‌థ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభిమానులు వేడుక‌ల‌కి దూరంగా ఉండాల‌ని పిలుపునిచ్చారు. జనసాంద్రత ఎక్కువగా ఉండడం కరోనా వైరస్ వ్యాప్తికి కారణంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ఫ్యాన్స్ గుంపులుగా చేరి ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించరాదని ఆయన కోరారు. తన పుట్టిన రోజు నిర్వహించకపోవడమే ఫ్యాన్స్ తనకు ఇచ్చే అతిపెద్ద గిఫ్ట్ అని ఆయన చెప్పుకొచ్చారు.  ఇటీవ‌ల ఎన్టీఆర్‌తో క‌లిసి వీడియో ద్వారా క‌రోనా నుండి ఎలా కాపాడుకోవాలో, తీసుకోవ‌ల‌సిన జాగ్ర‌త్తలు ఎంటో చ‌ర‌ణ్ వివ‌రించిన విష‌యం తెలిసిందే. logo