హీరోలకు కాస్ట్ లీ బైక్స్, లగ్జరీ కార్ల మీద మోజు ఎక్కువనే సంగతి తెలిసిందే. మొన్నా మధ్య జూనియర్ ఎన్టీఆర్ ‘లంబోర్ఘిని’ మోడల్ కారును ఆర్డర్ చేసారు. ఇటలీకి చెందిన వోక్స్ వాగన్ కంపెనీ అనుబంధ సంస్థనే ‘లంబోర్ఘిని’. ఇటీవల ఈ కారులో ఎన్టీఆర్ రయ్యిమంటూ దూసుకెళ్లారు.దీని ధర 3.16 కోట్లు ఉంటుంది. ఇండియాలో ఈ కారు కొన్న తొలి వ్యక్తి ఎన్టీఆర్.
ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కూడా తాజాగా లగ్జరీ కారు కొనుగోలు చేశారు. ఈ కారుని చెర్రీ తనకు నచ్చినట్టుగా డిజైన్ చేయించుకున్నట్టు తెలుస్తుంది. తాజాగా ఈ కారుని చెర్రీకి హ్యాండోవర్ చేయగా, బ్లాక్ కలర్ బెంజ్ కారులో రామ్ చరణ్ రయ్మని వెళ్లిపోయారు. దీని ధర దాదాపు రెండున్నర కోట్లు ఉంటుందని సమాచారం. ఈ కారుకి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు కలిసి ఆర్ఆర్ఆర్ అనే చిత్రంలో నటించగా, ఈ చిత్రం ఎప్పుడు వస్తుందనే దానిపై క్లారిటీ లేదు.ఇప్పటికే షూటింగ్ పూర్తైనప్పటికీ థియేటర్స్ అన్నీ తెరచుకోని కారణంగా మేకర్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేకపోతున్నారు. ఇందులో చెర్రీ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమురం భీంగా కనిపించనున్నారు.