గురువారం 28 జనవరి 2021
Cinema - Nov 30, 2020 , 09:05:04

జానీ మాస్ట‌ర్ డైరెక్ష‌న్‌లో ప‌వ‌న్, చెర్రీ చిత్రం!

జానీ మాస్ట‌ర్ డైరెక్ష‌న్‌లో ప‌వ‌న్, చెర్రీ చిత్రం!

ఇండ‌స్ట్రీలో కొన్ని కాంబినేష‌న్స్ ప్రేక్ష‌కుల‌కి అమితాస‌క్తిని క‌లిగిస్తుంటాయి. ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌- రామ్ చ‌ర‌ణ్‌-జానీ మాస్ట‌ర్ కాంబినేష‌న్‌లో ఓ చిత్రం తెర‌కెక్కనుంద‌ని గ‌త కొద్ది రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి.వీటిపై ఎవ‌రు క్లారిటీ ఇవ్వ‌క‌పోయిన అభిమానులు మాత్రం ఎన్నో ఊహించుకుంటున్నారు. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ ప్రాజెక్ట్ ఫిక్స్ అయిన‌ట్టు తెలుస్తుంది. 

ఇటీవ‌ల కొరియోగ్రాఫ‌ర్ జానీ మాస్ట‌ర్.. ప‌వ‌న్‌ని క‌లిసి క‌థ‌ని వినిపించార‌ట‌. ప‌వ‌న్ ఈ స్టోరీకి చాలా ఇంప్రెస్ కావ‌డంతో త్వ‌ర‌లోనే సినిమా చేద్దాం అని అన్నార‌ట‌. ఈ చిత్రాన్ని రామ్ చ‌ర‌ణ్ నిర్మించ‌నున్నాడ‌ని తెలుస్తుండ‌గా, త్వ‌రలోనే అధికారిక ప్ర‌క‌ట‌న రానుంద‌ని చెబుతున్నారు. ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం  'వకీల్‌సాబ్ చేస్తున్న ప‌వ‌న్ ఈ చిత్రం తర్వాత క్రిష్‌ దర్శకత్వంలో, హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో, సాగర్‌ కె చంద్ర దర్శకత్వంలో, సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో  ప‌లు చిత్రాలు చేయ‌నున్నాడు.


logo