శనివారం 30 మే 2020
Cinema - May 01, 2020 , 11:48:28

నానమ్మ ద‌గ్గ‌ర రెసిపీ నేర్చుకుంటున్న చ‌ర‌ణ్‌

 నానమ్మ ద‌గ్గ‌ర రెసిపీ నేర్చుకుంటున్న చ‌ర‌ణ్‌

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ లాక్‌డౌన్ కార‌ణంగా ఇంటికే ప‌రిమితమైన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల బీ ది రియ‌ల్ మెన్ ఛాలెంజ్‌లో భాగంగా చెర్రీ ఇంటి ప‌నులు చేయ‌డంతో పాటు త‌న స‌తీమ‌ణికి అద్భుత‌మైన కాఫీ కూడా పెట్టి ఇచ్చాడు. ఇక తాజాగా త‌న  నానమ్మ ద‌గ్గ‌ర అద్భుత‌మైన రెసిపీ నేర్చుకుంటున్నాడు. అందుకు సంబంధించిన వీడియో షేర్ చేశాడు.

చిక్క‌టి పెరుగు నుండి వెన్న తీయ‌డం మ‌నం ఎప్ప‌టి నుండో చూస్తున్నాం. గ‌తంలో అయితే కవ్వంతో చిలికి తీసేవారు. ఇప్పుడు అలా కాదు అంతా ఎలక్ట్రిక్‌వి వ‌చ్చేశాయి. ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్ కూడా ఎల‌క్ట్రిక్ మెషీన్‌తో వెన్న తీయ‌డం నేర్చుకుంటున్నాడు. అది కూడా  నానమ్మ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో. చెర్రీ మ‌జ్జిగ చిల‌కడాన్ని చూసిన చిరు త‌ల్లి కృష్ణుడిలా ఉన్నావంటూ ప్ర‌శంస‌లు కురిపించింది. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. 


logo