బుధవారం 03 జూన్ 2020
Cinema - Mar 27, 2020 , 14:57:34

తండ్రి మాట‌ల‌కి త‌న్మ‌య‌త్వం చెందిన రామ్ చ‌ర‌ణ్‌

తండ్రి మాట‌ల‌కి త‌న్మ‌య‌త్వం చెందిన రామ్ చ‌ర‌ణ్‌

కొడుకు పుట్ట‌గానే కాదు, ఆ కొడుకు ప్ర‌యోజ‌కుడు అయిన‌ప్పుడే ఆ తండ్రి సంతోషిస్తాడు అనే పాత నానుడి ఒక‌టి ఉంది. దీనిని నిజం చేశాడు రామ్ చ‌ర‌ణ్‌. రీల్ లైఫ్‌లోను, రియ‌ల్ లైఫ్‌లోను తండ్రికి త‌గ్గ త‌న‌యుడు అనిపించుకున్నాడు రామ్ చ‌ర‌ణ్‌. నేడు చెర్రీ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా  గ‌త రాత్రి చిరు ట్వీట్ చేశారు.

రామ్‌ చరణ్‌ పుట్టినప్పుడు నేను ఎంతో సంతోషించాను. మార్చి 27న రామ్‌ చరణ్‌ ఎందుకు పుట్టాడో తర్వాత అర్ధమైంది. ప్రపంచ రంగస్థల దినోత్సవం రోజున పుట్టిన చరణ్ నటనలో చేప కిందు నీరులా పాకాడు. ఈ రోజు బర్త్‌డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని చిరంజీవి తన ట్వీట్‌లో పేర్కొన్నారు

చిరు ట్వీట్‌పై స్పందించిన రామ్ చ‌ర‌ణ్‌.. నా హీరో నుండి ఇలాంటి మాట‌లు రావ‌డం చాలా ఆనందంగా ఉంది. ఆ రోజుకి నాకు ఏమైన సంబంధం ఉందా లేదా అని నేను చెప్పలేను. కాని మా నాన్న దానిని చేసి చూపించారు. శుభాకాంక్ష‌లు అందించిన మీకు ధ‌న్య‌వాదాలు అని ట్వీట్ చేశారు. 


logo