మంగళవారం 20 అక్టోబర్ 2020
Cinema - Sep 28, 2020 , 12:35:08

రామ్ చ‌ర‌ణ్ 13 ఏళ్ళ సినీ ప్ర‌స్థానం

రామ్ చ‌ర‌ణ్ 13 ఏళ్ళ సినీ ప్ర‌స్థానం

మెగాస్టార్ చిరంజీవి త‌నయుడిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చ‌ర‌ణ్ .. చిరుత సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. తొలి సినిమానే అయిన‌ప్ప‌టికీ యాక్షన్ సీన్స్, ఎమోషన్, డ్యాన్సులు ఇలా ప్రతీ విషయంలో నిరూపించుకున్నాడు రామ్ చ‌ర‌ణ్‌ .  ‘చిరుత’  కి మొదట ‘కుర్రాడు’ అనే టైటిల్ అనుకున్నారు. ఈ  టైటిల్ కి ఉప  శీర్షిక గా  'లో క్లాస్ ఏరియా ‘ అని పెడదామనుకున్నారు . కాని చిరు తనయుడు అని అర్ధం వచ్చేట్టుగా ‘చిరుత’ అని ఫైనల్ గా డిసైడ్ అయ్యారు.

చిరుత చిత్రంతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌య‌మైన రామ్ చ‌ర‌ణ్ నేటితో (సెప్టెంబ‌ర్ 28) త‌న 13 ఏళ్ళ సినీ ప్ర‌స్థానం పూర్తి చేసుకున్నాడు. ఈ సంద‌ర్భంగా 13YearsForRamCharanInTFI అనే హ్యాష్ ట్యాగ్‌తో ర‌చ్చ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్ . అయితే కెరీర్‌లో 13 ఏళ్ళు పూర్తి అయిన సంద‌ర్భంగా చెర్రీ ట్వీట్ చేశారు. 13 ఏళ్ళు పూర్త‌య్యాయంటే న‌మ్మశ‌క్యంగా లేదు. ఎన్నో ఎత్తు ప‌ల్లాలు చూశాను. ప్ర‌తి క్ష‌ణాన్ని ఎంతో ఇష్టపడ్డాను. ఎల్లప్పుడూ నాకు స‌పోర్ట్‌గా నిలిచిన  నా ప్రియమైన అభిమానులకు ధన్యవాదాలు. మీ ప్రేమ‌కు నేను ధ‌న్యుడిని. మీ కోసం ఇంకా క‌ష్ట‌ప‌డ‌తాన‌ని ప్రామిస్ చేస్తున్నాను. చిరుత షూటింగ్‌కు సంబంధించిన ప్ర‌తిరోజు నాకు బాగా గుర్తుంది. నిన్న మొన్ననో షూటింగ్‌లో పాల్గొన్న‌ట్టు అనిపిస్తుంది. పూరీ జ‌గ‌న్‌, వైజ‌యంతి ఫిలింస్, నేహా శ‌ర్మ‌, మ‌ణిశ‌ర్మ‌తో పాటు చిత్ర బృందానికి నా కృత‌జ్ఞ‌త‌లు. ఈ రోజు పుట్టిన రోజు జ‌రుపుకుంటున్న పూరీకు ప్ర‌త్యేక శుభాకాంక్ష‌లు అని చ‌ర‌ణ్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.  

మొదటి సినిమాతోనే స‌త్తా చాటిన  రామ్ చరణ్   రెండో చిత్రంతోనే ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టేశాడు. మగధీర చిత్రంతో టాలీవుడ్ నెంబర్ వన్ హీరోగా ఎదిగాడు. ఆ త‌ర్వాత  ఆరెంజ్, రచ్చ, నాయక్, ఎవడు, గోవిందుడు అందరివాడేలే, బ్రూస్‌లీ, ధృవ, రంగస్థలం, విన‌య విధేయ రామ‌ ఇలా ఒక్కో చిత్రంతో ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చాడు. రంగస్థలం చిత్రంతో చెర్రీ త‌న న‌ట విశ్వ‌రూపం చూపించి తండ్రికి త‌గ్గ త‌న‌యుడు అని నిరూపించుకున్నాడు.  ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్‌తో క‌లిసి ఆర్ఆర్ఆర్ అనే భారీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఇందులో అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో క‌నిపించి అల‌రించ‌నున్నాడు. 


logo