ఆచార్యలో ‘సిద్ధ’గా రాంచరణ్.. లుక్ రివీల్

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ కీలకపాత్ర పోషిస్తున్నాడు. తాజాగా రామ్ చరణ్ ప్రీ లుక్‌ను చిత్రబృందం రివీల్ చేసింది. మా ‘సిద్ధ’ సర్వం సిద్ధం.. ‘సెట్లోకి రాంచరణ్‌కు స్వాగతం పలుకుతున్నాం’ అంటూ దర్శకుడు ట్వీట్ చేశాడు. ఈ ఫొటోలో రాంచరణ్ వెనుక చెవికి రింగు, మెడలో రుద్రాక్షతో ఆలయంలోకి వెళ్తున్నట్లుగా కనిపిస్తోంది. ఆచార్య సినిమా కొత్త అప్డేట్తో మెగా అభిమానులు ఖుషి అవుతున్నారు. ఆచార్య మూవీ షూటింగ్ లాక్డౌన్ అనంతరం శరవేగంగా జరుగుతోంది. ఇప్పటి వరకు రాంచరణ్ పాత్రకు సంబంధించి షూటింగ్ ప్రారంభం కాలేదు. ఇటీవల కరోనా వైరస్ పాజిటివ్‌గా పరీక్షించడంతో సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండి కోలుకున్న విషయం తెలిసిందే. ఇటీవల నుంచి ఆచార్య షూటింగ్‌కు హాజరవుతున్నాడు.
ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ చిత్రంలోనూ నటిస్తున్న విషయం తెలిసిందే. ఆచార్య మూవీలో హీరోయిన్గా కాజల్ అగర్వాల్ నటిస్తోండగా.. మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ సినిమాను కొణెదల ప్రొడక్షన్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆచార్య సినిమాను సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. మెగాస్టార్, మెగా పవర్ స్టార్‌ను కలిసి వెండితెరపైన చూడాలని అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.
తాజావార్తలు
- రెండు సీట్లూ మావే
- స్థానిక సంస్థలను బలోపేతం చేయాలి
- స్థలాలు ఆక్రమణకు గురి కాకుండా చూడండి
- పార్టీ బలోపేతానికి శ్రేణులు కృషి చేయాలి
- ఆహార భద్రత పథకంలో నిర్లక్ష్యం తగదు
- ఉదాత్తురాలు వాణీదేవి
- సభ్యత్వం స్వీకరించిన వలసజీవులు..
- రాష్ట్ర అభివృద్ధి కేసీఆర్‌తోనే సాధ్యం
- మిషన్ భగీరథ నీటిపై అవగాహన
- ఎమ్మెల్యేలదే బాధ్యత