సెలబ్రిటీ వివాహాలపై తరచూ ఏదో ఒక గాసిప్ చక్కర్లు కొడుతుందనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొన్నాళ్లుగా ఎక్కువగా వైరల్ అయిన గాసిప్ బుమ్రా-అనుపమ రిలేషన్షిప్. అనుపమ-బుమ్రా డేటింగ్ లో ఉన్నారని వార్తలు రాగా..అలాంటిదేమి లేదని అవన్నీ వట్టి పుకార్లేనని అనుపమ కొట్టిపారేసింది. అయితే ఆ తర్వాత కూడా త్వరలోనే బుమ్రా-అనుపమ వివాహ బంధంతో ఒక్కటవుతున్నారని వార్త తెరపైకి వచ్చింది. దీంతో సంజన గణేశన్ (బుమ్రా గర్ల్‌ఫ్రెండ్) లైమ్ లైట్లోకి వచ్చి బుమ్రాను పెండ్లి చేసుకోబోయేది తానేనని క్లారిటీ ఇచ్చింది.
ఫైనల్ గా నేడు బుమ్రా-అనుపమ పెళ్లి బంధంతో ఒక్కటవడంతో గాసిప్ రాయుళ్ల నుంచి అనుపమకు పూర్తి స్వేచ్చ దొరికింది. ఇప్పటివరకు రూమర్స్ తో విసుగు చెందిన అనుపమ..ఇక నుంచి రిలాక్స్ అయిపోయి తీరగ్గా సినిమాలపై ఫోకస్ పెట్టుకోవచ్చంటున్నారు సినీ జనాలు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.