మంగళవారం 04 ఆగస్టు 2020
Cinema - Jul 06, 2020 , 09:16:49

రెమ్యునరేషన్‌ తగ్గించిన రకుల్‌ప్రీత్‌

రెమ్యునరేషన్‌ తగ్గించిన రకుల్‌ప్రీత్‌

హైదరాబాద్‌ : లాక్‌డౌన్‌ కారణంగా సినిమా షూటింగ్‌లు నిలిచిపోయాయి. ప్రభుత్వ సడలింపులతో ఇప్పుడిప్పుడే తిరిగి ప్రారంభమవుతున్నాయి.  సినిమాలపై ఆధారపడి బతికేవారు ఇన్ని రోజులు పనులు లేక ఇబ్బందులు పడ్డారు. నిర్మాతలకు సైతం కోట్లలో నష్టాలు వచ్చాయి. దీంతో సీని నటులు కొందరు తమ రెమ్యునరేషన్స్ తగ్గించి నిర్మాతలపై భారాన్ని తగ్గిస్తున్నారు. లాక్‌డౌన్‌కు ముందు స్టార్‌ హిరోయిన్‌గా వెలుగొందిన రకుల్‌ప్రీత్‌ సింగ్‌  తన రెమ్యునరేషన్‌ను తగ్గించింది.

ప్రస్తుతం చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ హీరోగా నటిస్తున్న చిత్రంలో నటిస్తుంది. ఒకప్పుడు సినిమాకు కోటిన్నర రెమ్యునరేషన్‌ తీసుకున్న రకుల్ ఇప్పుడు అందులో సగం ఇచ్చినా నటించేందుకు సై అంటున్నట్లు తెలుస్తుంది. అయినా కూడా అవకాశాలు రావడం కష్టంగానే మారుతుందిప్పుడు. దాంతో బాలీవుడ్, కోలీవుడ్ వైపు అడుగులు వేస్తుంది రకుల్. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo