రకుల్‌ప్రీత్‌కు కరోనా

కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టడంతో వివిధ భాషా పరిశ్రమల్లో సినిమా చిత్రీకరణల సందడి మొదలైంది. నటీనటులు అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్స్‌లో పాల్గొంటున్నప్పటికి ఈ మహమ్మారి ముప్పు పూర్తిగా తొలగిపోలేదు. ఇప్పటికే ఎందరో సినీ ప్రముఖులు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా కథానాయిక రకుల్‌ప్రీత్‌సింగ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ జరిగింది. ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. కరోనా నిర్ధారణ కావడంతో తాను స్వీయ గృహనిర్భంధంలోకి వెళ్లానని, తనను కలిసి వ్యక్తులందరూ పరీక్షలు చేయించుకోవాలని సూచించింది. ప్రస్తుతం తన ఆరోగ్యపరిస్థితి బాగుందని..తగినంత విశ్రాంతి తీసుకొని తిరిగి షూటింగ్స్‌కు హాజరవుతానని రకుల్‌ప్రీత్‌సింగ్ పేర్కొంది. ప్రస్తుతం రకుల్‌ప్రీత్‌సింగ్ తెలుగులో క్రిష్ దర్శకత్వంలో ఓ చిత్రంతో పాటు నితిన్ సరసన ‘చెక్' సినిమాలో నటిస్తోంది. బాలీవుడ్లో మూడు సినిమాలతో బిజీగా ఉంది.
తాజావార్తలు
- రాష్ట్రంలో 40 డిగ్రీలకు చేరువలో ఎండలు
- 28-02-2021 ఆదివారం.. మీ రాశి ఫలాలు
- షీ టీమ్స్ ఆధ్వర్యంలో భారీ జాబ్ మేళా నిరుద్యోగులకు.. కొలువులు
- అతివేగం.. ప్రాణం తీసింది
- మెరుగైన సేవలకు.. చేతులు కలపండి
- పారిశ్రామిక పురోభివృద్ధిలో మేడ్చల్
- సఫారీ టూర్.. మరింత కొత్తగా
- హైదరాబాద్ స్టార్టప్‌కు ఇన్నోవేషన్ ఎక్స్‌ప్రెస్ అవార్డు
- రూ.60 లకు తిన్నంత బిర్యానీ
- మనకు కావాల్సింది నిమిషాల్లో తెచ్చిస్తారు