మంగళవారం 26 మే 2020
Cinema - May 23, 2020 , 15:50:22

108 సార్లు సూర్య న‌మ‌స్కారం చేస్తున్న ర‌కుల్‌

108 సార్లు సూర్య న‌మ‌స్కారం చేస్తున్న ర‌కుల్‌

ఫిట్‌నెస్ విష‌యంలో ప‌ర్‌ఫెక్ట్‌గా ఉండే ర‌కుల్ ప్రీత్ సింగ్ ప్ర‌తి రోజు త‌న‌దైన స్టైల్‌లో వ్యాయామాలు చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉంటుంది. ఒక్కోసారి తాను చేసే వ‌ర్క‌వుట్స్‌కి సంబంధించిన వీడియోల‌ని సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ వావ్ అనిపిస్తూ ఉంటుంది.

తాజాగా లాక్‌డౌన్ వ‌ర్కవుట్స్ విష‌యాలు చెప్పుకొచ్చింది. లాక్‌డౌన్ స‌మ‌యంలో తాను రెండు మూడు రోజుల‌కొక‌సారి 108 సూర్య న‌మ‌స్కారాలు చేస్తాన‌ని అంది.  ఈ ఫీలింగ్ వ‌ర్ణించ‌లేనిది.  దీని వ‌ల‌న  అంతర్గత మరియు బాహ్య బలం పెంపొందించుకోవ‌చ్చు.  మనస్సు, శరీర సమతుల్యతను సృష్టించడానికి , శరీరంలోని ప్రతి అవయవం నుండి వ్య‌ర్ధాల‌ని తొల‌గించ‌డానికి ఇది ఎంత‌గానో సహాయపడుతుంది అని ర‌కుల్ పేర్కొంది. 

తెలుగులో నితిన్ సరసన చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న ర‌కుల్‌..  కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఇండియన్ 2లో సినిమాలో నటిస్తోంది. మరోవైపు హిందీలో అర్జున్ కపూర్ హీరోగా వస్తోన్న ఓ రొమాంటిక్ కామెడీలో నటిస్తోంది.
logo