మంగళవారం 01 డిసెంబర్ 2020
Cinema - Oct 24, 2020 , 12:53:18

40 రోజుల‌లో షూటింగ్‌కు ప్యాక‌ప్ చెప్పిన క్రిష్‌

40 రోజుల‌లో షూటింగ్‌కు ప్యాక‌ప్ చెప్పిన క్రిష్‌

టాలీవుడ్‌లో జెట్ స్పీడ్‌తో సినిమా షూటింగ్‌లు చేసే ద‌ర్శ‌కులు కొంద‌రు ఉన్నారు.వారిలో పూరీ జ‌గ‌న్నాథ్‌, క్రిష్ వంటి డైరెక్ట‌ర్స్ నెల‌రోజుల‌లోనే సినిమాని పూర్తి చేస్తుంటారు. గ‌మ్యం సినిమాతో త‌నెంటో నిరూపించుకున్న క్రిష్ ప్రేమ కథా చిత్రాల‌తో పాటు చారిత్రాత్మ‌క చిత్రాల‌ను నిర్మించారు. బాల‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌లో క్రిష్ తెర‌కెక్కించిన గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి చిత్రం కేవ‌లం 80 రోజుల‌లోనే షూటింగ్ పూర్తైంది. 

తాజాగా క్రిష్‌.. మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ ప్ర‌ధాన పాత్ర‌లో ఓ చిత్రం చేస్తున్నాడు. ఇందులో ర‌కుల్ ప్రీత్ సింగ్ క‌థానాయికగా న‌టిస్తుంది. అట‌వీ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చాలా వ‌ర‌కు వికారాబాద్ అడ‌వుల‌లోనే జ‌రిగింది. కరోనా, భారీ వర్షాలను లెక్క చేయకుండా టాకీ భాగం మొత్తాన్ని కేవలం 35 రోజుల్లో పూర్తి చేశారు. ఓ పాట బ్యాలెన్స్ ఉండ‌గా, దానికి ఐదు రోజుల స‌మ‌యం ప‌డుతుంద‌ని అంటున్నారు. 40 రోజుల‌లో షూటింగ్ పూర్తి కావ‌డంపై సంతోషం వ్య‌క్తం చేసిన ర‌కుల్ లొకేష‌న్‌కు సంబంధించిన వీడియో కూడా షేర్ చేసింది.