మంగళవారం 26 మే 2020
Cinema - May 23, 2020 , 17:14:59

లాక్‌డౌన్‌ : సూర్యనమస్కారాలు చేసే పనిలో పడ్డ రకుల్‌

లాక్‌డౌన్‌ : సూర్యనమస్కారాలు చేసే పనిలో పడ్డ రకుల్‌

రకుల్‌ ప్రీత్‌సింగ్‌ ఎప్పుడూ కూల్‌ కూల్‌గా కనిపించడానికి కారణం ఆమె చేస్తున్న యోగానే. లాక్‌డౌన్‌లో యూట్యూబ్‌ చానల్‌ ప్రారంభించడమే కాకుండా వర్కౌట్స్‌ చేస్తున్న వీడియోలను కూడా సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. లాక్‌డౌన్‌లో మరొక మంచి పనికూడా చేస్తున్నది రకుల్‌. వారానికి కనీసం 2-3 సార్లు 108 సూర్యనమస్కారాలు చేస్తుంది. ఇలా చేయడం వల్ల మనసు ఎంతో ప్రశాంతంగా ఉండడంతోపాటు ఎంతో మనోధైర్యాన్నిస్తుందని అంటున్నది ఈ అమ్మడు. అంతేకాదు ఏకాగ్రతను కూడా పెంచుతుందంటున్నది. సూర్యనమస్కారాలు చేస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది రకుల్‌. ఇప్పుడు ఈ వీడియో అభిమానులను అకట్టుకుంటున్నది.


రెండేండ్ల క్రితమే రకుల్‌ యోగా ప్రయాణం మొదలైంది. అప్పటి నుంచి ఆమె చాలా ఆనందంగా ఉందని చెబుతున్నది. ఇకపోతే ప్రస్తుతం కమల్‌ హాసన్‌ ప్రతిష్టాత్మకంగా రాబోయే చిత్రం "ఇండియన్ 2" లో రకుల్ ప్రీత్ కనిపించనుంది. ఇందులో కాజల్ అగర్వాల్, విద్యుత్ జమ్వాల్ కూడా ఉన్నారు.


logo