బుధవారం 30 సెప్టెంబర్ 2020
Cinema - Aug 15, 2020 , 00:16:07

క్రిష్‌ దర్శకత్వంలో..

క్రిష్‌ దర్శకత్వంలో..

రకుల్‌ప్రీత్‌సింగ్‌, పంజా వైష్ణవ్‌తేజ్‌ నాయకానాయికలుగా క్రిష్‌ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. ఫస్ట్‌ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై జాగర్లమూడి సాయిబాబు, వై.రాజీవ్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శుక్రవారం పూజా కార్యక్రమాల్ని నిర్వహించారు. ‘ఫారెస్ట్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న చిత్రమిది. శనివారం నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమవుతుంది. సింగిల్‌ షెడ్యూల్‌లో సినిమాను పూర్తిచేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. రకుల్‌ప్రీత్‌సింగ్‌, వైష్ణవ్‌తేజ్‌ పాత్రలు వినూత్న పంథాలో సాగుతాయి’ అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి జ్ఞానశేఖర్‌ వి.ఎస్‌. ఛాయాగ్రహణాన్ని అందిస్తున్నారు.  పవన్‌కల్యాణ్‌ హీరోగా క్రిష్‌ దర్శకత్వంలో ఓ సినిమా రూపుదిద్దుకోనున్నది. ‘వకీల్‌సాబ్‌' చిత్రీకరణ పూర్తయిన తర్వాత పవన్‌కల్యాణ్‌, క్రిష్‌ సినిమా సెట్స్‌పైకిరానున్నది. 


logo