మంగళవారం 14 జూలై 2020
Cinema - Apr 28, 2020 , 23:19:01

కరోనా కట్టడికి రకుల్‌ చిట్కాలు

కరోనా కట్టడికి రకుల్‌ చిట్కాలు

కరోనా మహమ్మారిని నిర్మూలించాలంటే స్వీయ నిర్బంధంతో పాటు మన శరీరంలో సహజసిద్ధంగా వ్యాధి నిరోధక వ్యవస్థను బలోపేతం చేసుకోవడం కూడా ప్రధానమని వైద్య నిపుణులు చెబుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ‘సీ’ మిటమిన్‌ ఉన్న పండ్లు, కూరగాయల్ని విరివిరిగా తీసుకోవాలని ప్రజల్ని కోరుతున్నారు. కరోనా కట్టడి విషయంలో సోషల్‌మీడియా ద్వారా ప్రజల్ని జాగృతం చేస్తున్నారు సినీ తారలు. తాజాగా పంజాబీ సుందరి రకుల్‌ప్రీత్‌సింగ్‌ నేచురల్‌గా ఇమ్యూనిటీని పెంచుకునేందుకు కొన్ని చిట్కాల్ని చెప్పింది.

 ‘కరోనాను ఎదుర్కోవాలంటే ప్రభుత్వ సూచనల్ని పాటించడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుకోవడం చాలా ముఖ్యం. మన ఇంటిలోనే సహజ పద్దతుల్లో ఇమ్యూనిటీని పెంచే పానీయాల్ని తయారు చేసుకోవచ్చు. అరలీటరు నీటిని తీసుకొని  అందులో అల్లం, మిరియాలు, పసుపు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క కలిపి బాగా మరిగించాలి. చల్లార్చిన తర్వాత కాస్త తేనె కలుపుకొని ఈ పానీయాన్ని తాగితే రుచిగా ఉంటుంది. శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడంతో పాటు ఇమ్యూనిటీ బూస్టర్‌లా పనిచేస్తుంది. ఇది కాఫీకి ప్రత్యామ్నాయంగా కూడా పనిచేస్తుంది’ అని చెప్పింది రకుల్‌ప్రీత్‌సింగ్‌.logo