బుధవారం 21 అక్టోబర్ 2020
Cinema - Sep 13, 2020 , 00:23:30

టాలీవుడ్‌లో రకుల్‌ కలకలం

టాలీవుడ్‌లో  రకుల్‌ కలకలం

మాదక ద్రవ్యాల కేసులో ప్రముఖ టాలీవుడ్‌ కథానాయిక రకుల్‌ప్రీత్‌సింగ్‌ పేరు బయటికి రావడం టాలీవుడ్‌లో కలకలం రేపింది. ఫిట్‌నెస్‌ విషయంలో సామాజిక మాధ్యమాల ద్వారా పలు పోస్టులు పెట్టే రకుల్‌ మాదకద్రవ్యాల వినియోగం కేసులో ఉండటం టాలీవుడ్‌లో పలువుర్ని ఆశ్చర్యానికి గురిచేసింది. బాలీవుడ్‌ కథానాయకుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ అనుమానాస్పద మృతి కేసులో కస్టడిలో వున్న రియా ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో మాదకద్రవ్యాల సరఫరా, కొనుగోలు చేసే 25మంది ప్రముఖుల పేర్లను అందించినట్లుగా సమాచారం. అయితే ఆ జాబితాలో ప్రముఖ నాయిక రకుల్‌ప్రీత్‌ సింగ్‌తో పాటు సారా అలీఖాన్‌, ప్రముఖ డిజైనర్‌ సిమోనీ ఖంబట్టా వున్నారని పలు ఇంగ్లీష్‌ దినపత్రికలతో పాటు, పలు న్యూస్‌ఛానెల్స్‌ల్లో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వారిని విచారించనున్నట్లు తెలిసింది. అయితే రకుల్‌ప్రీత్‌ సింగ్‌ పేరు మాదకద్రవ్యాల కేసులో వినిపించడం ఆమె అభిమానులు కాస్త ఆందోళనకు గురవుతున్నారు.logo