ఆదివారం 07 మార్చి 2021
Cinema - Jan 25, 2021 , 11:50:42

ర‌కుల్ కోవిడ్ రిక‌వ‌రీ జ‌ర్నీ- వీడియో

ర‌కుల్ కోవిడ్ రిక‌వ‌రీ జ‌ర్నీ- వీడియో

సామాన్యులే కాక సెల‌బ్రిటీల‌ను సైతం క‌రోనా మ‌హ‌మ్మారి ఎంత‌లా వ‌ణికించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. క‌రోనా వ‌ల‌న సెల‌బ్రిటీలు అంద‌రు షూటింగ్‌లు మానేసి దాదాపు ఎనిమిది నెల‌లు ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. ఇక ఇప్పుడిప్పుడే  సెట్స్ లో అడుగుపెడుతున్నారు. అయితే కోవిడ్  జాగ్ర‌త్త‌లు తీసుకొని షూట్స్ చెస్తున్న‌ప్ప‌టికీ కొంద‌రు క‌రోనా బారిన‌ప‌డుతున్నారు. ఇటీవ‌లి కాలంలో త‌మ‌న్నా, ర‌కుల్‌, రామ్ చ‌ర‌ణ్‌, వ‌రుణ్ తేజ్ వంటి ప‌లువురు సెల‌బ్రిటీలు క‌రోనాతో బాధ‌ప‌డ్డారు.

పంజాబీ సోయ‌గం ర‌కుల్ కూడా కొద్ది రోజుల క్రితం క‌రోనా బారిన ప‌డింది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా త‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేసింది. అయితే త‌ను క‌రోనా నుండి ఎలా కోలుకుంది, ఏయే జాగ్ర‌త్త‌ల‌తో క‌రోనా నుండి బ‌య‌ట‌ప‌డింద‌నే విష‌యాన్ని వీడియో ద్వారా వివ‌రించింది. ప‌లు యోగ‌స‌నాలు, బ్రీత్ ఎక్స‌ర్‌సైజ్‌లు చేస్తూ వాటితో కొన్ని విట‌మిన్ టాబ్లెట్స్‌ని తీసుకొని క‌రోనా నుండి కోలుకున్న‌ట్టు ర‌కుల్ పేర్కొంది. ఈ వీడియో మీరు చూడండి.


VIDEOS

logo