శనివారం 06 జూన్ 2020
Cinema - May 23, 2020 , 23:18:26

సూర్యునికి ప్రణామం

సూర్యునికి ప్రణామం

పంజాబీ ముద్దుగుమ్మ రకుల్‌ప్రీత్‌సింగ్‌ ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యతనిస్తుంది. ఏ కొంచెం విరామం దొరికినా ఆ సమయాన్ని    వ్యాయామానికే కేటాయిస్తుంది. ఈ లాక్‌డైన్‌ సమయంలో ఆమె సూర్యనమస్కారాలపై ఎక్కువగా దృష్టిపెట్టిందట. వారానికి రెండుమూడుసార్లు 108 సూర్యనమస్కారాల్ని చేశానని ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో పేర్కొంది రకుల్‌ప్రీత్‌సింగ్‌. ‘సూర్య నమస్కారాల వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. శారీరకంగా, మానసికంగా శక్తివంతంగా తయారవుతాం. దేహం, మనసు మధ్య సమతుల్యతను సాధించి మనలోని అంతఃశక్తుల్ని మేల్కొలిపే గొప్ప శక్తిసాధనం సూర్యనమస్కారం. దీనిని ప్రతిరోజు ఆచరించడం వల్ల శరీరంలోని విషకారకాలన్నీ బయటకు తొలగిపోతాయి’ అని రకుల్‌ప్రీత్‌సింగ్‌ పేర్కొంది. ఈ సందర్భంగా యోగా సాధన చేస్తున్న కొన్ని పాత వీడియోలను అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ భామ బాలీవుడ్‌లో మూడు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.logo