ఆదివారం 31 మే 2020
Cinema - May 08, 2020 , 23:01:17

మెడికల్‌ షాప్‌లో మద్యమా?

మెడికల్‌ షాప్‌లో మద్యమా?

‘రకుల్‌ప్రీత్‌సింగ్‌ వైన్‌ కొనుగోలు చేసింది. ఇదిగో ఇదే వీడియో’ అంటూ సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. చేతిలో  బాటిల్‌ పట్టుకొని రకుల్‌ప్రీత్‌సింగ్‌ వడివడిగా నడుచుకుంటూ వెళ్తున్న ఆ వీడియోను చూసి నిజంగానే రకుల్‌ ఆల్కాహాల్‌ ఖరీదు చేసిందని నెటిజన్లు కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. అయితే ఈ వీడియోపై బూమ్‌లైవ్‌ అనే మీడియా సంస్థ స్పష్టత నిచ్చింది. రకుల్‌ప్రీత్‌సింగ్‌ మెడికల్‌ షాప్‌కు వెళ్లి సిరప్‌ తీసుకొస్తుండగా తీసిన వీడియో అదని పేర్కొంది. అయితే ఈ విషయంపై కేఆర్‌కే బాక్సాఫీస్‌ వెబ్‌సైట్‌ స్పందిస్తూ ‘లాక్‌డౌన్‌ టైమ్‌లో రకుల్‌ ఆల్కాహాల్‌ కొనుగోలు చేసిందా’ అంటూ ట్విట్టర్‌లో ప్రశ్నించింది.  దీనికి కౌంటర్‌గా ‘మెడికల్‌ షాప్‌లో ఆల్కాహాల్‌ దొరుకుందనే విషయం నాకు తెలియదు’ అంటూ సదరు వెబ్‌సైట్‌కు వ్యంగ్యంగా సమాధానమిచ్చింది రకుల్‌ప్రీత్‌సింగ్‌. ఈ  వివాదం ఇంతటితో సద్దుమణిగిందని భావించే లోపే ఆ వీడియోలో ఉన్నది రకుల్‌ కాదు దీపికాపదుకునే అంటూ కొందరు ప్రచారం చేశారు.  దీంతో రకుల్‌ప్రీత్‌సింగ్‌ వీడియో సోషల్‌మీడియాలో చర్చనీయాశంగా మారింది. logo