గురువారం 04 జూన్ 2020
Cinema - May 21, 2020 , 23:09:59

ప్రణాళికలు తారుమారు

ప్రణాళికలు తారుమారు

‘ఈ ఏడాది ఎన్నో కొత్త ప్రణాళికల్ని సిద్ధం చేసుకున్నా. సినిమాల విషయంలో విరామం లేకుండా పనిచేయాలని తపిస్తాను. కానీ కరోనా కారణంగా అనుకోని విరామం దొరికింది. నా జీవితంలో ఎక్కువకాలం విరామం తీసుకుంది ఈ లాక్‌డౌన్‌ రోజుల్లోనే’ అని చెప్పింది పంజాబీ సుందరి రకుల్‌ప్రీత్‌సింగ్‌. ప్రస్తుతం ఆమె లాక్‌డౌన్‌ సమయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీలో గడుపుతోంది. సేవా కార్యక్రమాలతో పాటు సోషల్‌మీడియాలో అభిమానులతో ముచ్చటిస్తూ బిజీగా ఉంది. రకు ల్‌ప్రీత్‌సింగ్‌ మాట్లాడుతూ ‘హిందీలో నేను నటిస్తున్న మూడు చిత్రాలు ఈ ఏడాదే విడుదల కావల్సి ఉంది. కరోనా ప్రభావంతో అవి వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరం ఆరంభంలో ఎన్నో భారీ ప్లాన్స్‌ వేసుకున్నా. అవన్నీ కరోనా ఎఫెక్ట్‌ వల్ల తారుమారయ్యాయి. పరిస్థితులన్నీ పూర్వస్థితికి వచ్చి సాధారణ జీవితంలోకి అడుగుపెట్టాలని కోరుకుంటున్నా. తిరిగి సెట్స్‌లోకి ఎప్పుడు అడు గుపెట్టాలని ఆతృతగా ఎదురుచూస్తు న్నా’ అని పేర్కొంది. ప్రస్తుతం ఈ సుందరి బాలీవుడ్‌లో మూడు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.logo