శనివారం 30 మే 2020
Cinema - May 09, 2020 , 10:17:23

ర‌కుల్ పెళ్ళిపై స్పందించిన ఆమె త‌ల్లి..!

ర‌కుల్ పెళ్ళిపై స్పందించిన ఆమె త‌ల్లి..!

ఇటు సౌత్‌, అటు నార్త్‌లో పాపుల‌ర్ అయిన బ్యూటీ ర‌కుల్ ప్రీత్ సింగ్. ఈ అమ్మ‌డు ఎక్కువ‌గా త‌న సినిమాల‌తోనో లేదంటే ఫిట్‌నెస్ విష‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తూ ఉంటుంది. రీసెంట్‌గా ఆల్కాహాల్ కొనుగోలు చేసింది అంటూ ఓ వీడియోతో హాట్ టాపిక్‌గా నిలిచింది. దీనిపై మందుల షాపులో లిక్క‌ర్ దొర‌కుతుందా అంటూ  పుకార్ల‌కి గట్టిగా స‌మాధానం ఇచ్చింది ర‌కుల్‌.

తాజాగా ర‌కుల్ త‌న పెళ్లి వార్త‌ల‌తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ర‌కుల్ త‌ల్లి రీసెంట్‌గా ఓ ఇంట‌ర్వ్యూలో కూతురి పెళ్లిపై నోరు విప్పింది.  ప్ర‌స్తుతం ర‌కుల్ సినిమాల‌తో చాలా బిజీగా ఉంది. ఇప్పుడు పెళ్లి ఆలోచ‌న లేదు. తాను ఎవ‌రిని కోరుకుంటే అత‌నిని ఇచ్చి చేస్తాం అని పేర్కొంది ర‌కుల్ త‌ల్లి. మ‌న్మ‌థుడు 2 చిత్రం త‌ర్వాత ర‌కుల్ మ‌రో తెలుగు సినిమాకి సైన్ చేయ‌లేదు. త‌మిళం, హిందీలో మాత్రం వ‌రుస సినిమాలు చేస్తూ బిజీగా మారింది.


logo