మంగళవారం 19 జనవరి 2021
Cinema - Jul 09, 2020 , 23:56:18

అదే నిజమైన ప్రేమ

అదే నిజమైన ప్రేమ

ప్రేమ, పెళ్లి  బంధాలు జీవితానికి పరిపూర్ణత చేకూర్చుతాయని అంటోంది రకుల్‌ప్రీత్‌సింగ్‌.  ఈ బంధాలపై తనకు పూర్తి నమ్మకమున్నదని చెబుతోంది.ఇటీవల ఓ చాట్‌ షోలో పాల్గొన్న రకుల్‌ప్రీత్‌సింగ్‌ ప్రేమ పట్ల తన అభిప్రాయాల్ని   వెల్లడిస్త్తూ ‘తల్లిదండ్రుల వల్లే నిజమైన ప్రేమకు అర్థం తెలుసుకోగలిగా. ప్రేమనేది ఎంతో అందమైన భావన. దాని గొప్పతనాన్ని మాటల్లో వర్ణించలేము. కానీ కొంతమంది మాత్రం ప్రణయ, పరిణయ బంధాలను భారంగా భావిస్తుంటారు. అలా ఎందుకో అపోహపడతారో తెలియదు. ఎవరినైనా ప్రేమిస్తే నిజాయితీతో  మనస్ఫూర్తిగా వారిని ఇష్టపడాలి. అదే నిజమైన లవ్‌గా నేను నిర్వచిస్త్తా.  అలాంటి స్వచ్ఛమైన ప్రేమను అందించే మనస్తత్వం నాది.   ప్రేమతో పాటు వివాహ వ్యవస్థ పట్ల నాకు గౌరవముంది’ అని తెలిపింది. 

తనకు కాబోయే వ్యక్తిలో ఉండాల్సిన లక్షణాలు చెబుతూ ‘ నాకన్నా చాలా ఎత్తు ఉండాలి. హైహీల్స్‌ వేసుకున్నా నేను తలెత్తి చూడగలిగేంతా హైట్‌ ఉండాలి. అందం,  డబ్బు కంటే ముఖ్యంగా తెలివితేటలుండాలి. జీవితం పట్ల స్పష్టత, ఉన్నతమైన లక్ష్యాల్ని కలిగి వాటి సాధనకై  కృషిచేస్తూండాలి’ అని చెప్పింది. ఫిల్మ్స్‌, ఫిట్‌నెస్‌...ఫుడ్‌ మూడు ‘ఎఫ్‌'లకు జీవితంలో అమితంగా ప్రాధాన్యమిస్తుంటానని తెలిపింది రకుల్‌ప్రీత్‌సింగ్‌.