ఆదివారం 09 ఆగస్టు 2020
Cinema - Jul 09, 2020 , 18:57:03

నన్ను చేసుకోబోయేవాడు ఎలా ఉండాలంటే..

నన్ను చేసుకోబోయేవాడు ఎలా ఉండాలంటే..

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రంతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది పంజాబీ భామ రకుల్ ప్రీత్ సింగ్. ఆ తర్వాత తక్కువ కాలంలోనే స్టార్ హీరోలతో నటించి టాప్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకునే ఈ బ్యూటీకి పెళ్లి మీద మనసు మళ్లినట్టుంది. పెళ్లికి సంబంధించి కొన్ని విషయాలు షేర్ చేసుకోవడమే ఇందుకు నిదర్శనం. ఓ వ్యక్తిగా నేను మారాను.

ప్రేమకు నిజమైన అర్థాన్ని నా తల్లిదండ్రుల్లో చూశాను. పెద్దలు కుదిర్చిన వివాహంపై నాకు పూర్తి నమ్మకముంది. కొంతమంది జనాలు దీన్ని ఎందుకు ఒత్తిడిగా భావిస్తున్నారో నాకు అర్థం కాని విషయం. మీరు ఎవరినైనా ప్రేమిస్తే..తప్పకుండా మనస్పూర్తిగా ప్రేమిస్తారు. అలాంటి వ్యక్తినే నేను అని రకుల్ చెప్పింది. అంతేకాదు తనకు కాబోయే భర్త పొడవైనవాడై ఉండాలి. ఎంత అంటే తాను హైహీల్స్ వేసుకున్నా..నేను అతన్ని తలపైకెత్తి చూడాలి. రెండో ముఖ్యమైన లక్షణమేంటంటే అతను ఇంటెల్లెక్చువల్ అయి, జీవితంపై అవగాహన ఉన్న వ్యక్తి అయి ఉండాలని చెప్పుకొచ్చింది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo