టాలీవుడ్ (Tollywood) భామ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ హిందీ సినిమాలతో తీరిక లేకుండా ఉంది. ఈ బ్యూటీ హిందీలో చేస్తున్న తాజా సినిమాల్లో ఒకటి డాక్టర్ జీ (Doctor G). బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా (Ayushmann Khurrana ) లీడ్ రోల్ చేస్తున్నాడు. కాగా ఈ చిత్రం నుంచి రకుల్ ప్రీత్ సింగ్ లుక్ ను విడుదల చేశారు. ఈ మూవీలో రకుల్ డాక్టర్ ఫాతిమా పాత్రలో నటిస్తోంది. డాక్టర్ పాత్ర కావడంతో రకుల్ మెడికల్ టర్మినాలజీ గురించి, కొన్ని ముఖ్యమైన శస్త్ర చికిత్స విధానాల గురించి నేర్చుకుందట.
ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వస్తోన్న ఈ చిత్రాన్ని అనుభూతి కశ్యప్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో తన పాత్ర గురించి పలు విషయాలు షేర్ చేసుకుంది రకుల్. డాక్టర్ జీ షూటింగ్ లో పాల్గొనడం ఆసక్తికరమైన అనుభవాన్నిచ్చింది. నేను డాక్టర్ గా నటిస్తుండటంతో వ్యవహార శైలి, సిల్వర్ స్క్రీన్ పై పర్ ఫెక్ట్ గా కనిపించేందుకు కొన్ని ముఖ్యమైన విషయాలు నేర్చుకోవడం తప్పనిసరి. డాక్టర్ ఫాతిమాగా మారే ప్రయాణం అద్బుతంగా ఉంటుంది. ఈ పాత్రను నేనెప్పటికీ ఆదరిస్తాను. కొన్ని సీన్ల కోసం రోగులకు చికిత్స చేస్తున్నప్పుడు, డాక్టర్లు ఎంత బరువు, బాధ్యతలు కలిగి ఉంటారో, వారి జీవితం ఎంత కష్టంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని చెప్పింది రకుల్.
క్యాంపస్ కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సుమిత్ సక్సేనా సంభాషణలు సమకూరుస్తున్నారు. సౌరభ్ భరత్, విశాల్ వాఘ్, సుమిత్ సక్సేనా, అనుభూతి కశ్యప్ స్క్రీన్ పై అందిస్తున్నారు.
Love Story | లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు స్టార్ హీరోలు
Priya Prakash Varrier | ప్రియా వారియర్ పాటకు ఫిదా అవ్వాల్సిందే..వీడియో వైరల్
Jagapathi Babu: యూఎస్‌లో సరదాగా.. జగపతి బాబు పోస్ట్ వైరల్