ప్రస్తుతం తెలుగుతోపాటు హిందీ సినిమాలతోనూ తీరిక లేకుండా ఉంది ఢిల్లీ సోయగం రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh). ఈ భామ సోషల్ వీడియోలో ఎంత చురుకుగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎప్పుడూ ఏదో ఒక ఛిల్ అవుట్ మూడ్‌లో కనిపిస్తూ అందరినీ హుషారెత్తిస్తుంటుంది రకుల్. ఈ జీరో సైజ్ సుందరి తాజాగా రింగా రింగా రోజెస్ మూడ్ (Ringa ringa roses mood) లో ఉన్న స్టిల్స్ ను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. హేమన్ టాండ్ నందిత అర్త్ లేబుల్ కలెక్షన్స్ తోపాటు మాన్షు రూపొందించిన ఆభరణాలతో మెరిసిపోయింది.
నీలిరంగు ఫ్లోరల్ హాఫ్ శౌల్డర్స్, తెలుపు రంగు ప్యాంట్, బ్యాక్ గ్రౌండ్ కలర్ తో మ్యాచ్ అయ్యే గులాబీ రంగు సాండిల్స్ వేసుకున్న రకుల్‌ను అక్కడే కెమెరాలు క్లిక్ మనిపించాయి. రకుల్ చిరు మందహాసంతో రింగా రింగా రోజెస్ అంటూ పాడుకుంటూ హాయిగా చిందులేస్తూ కెమెరాకు ఫోజులిచ్చింది. రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం తెలుగులో వైష్ణవ్ తేజ్‌తో కలిసి కొండపొలం చిత్రంలో నటిస్తోంది. అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. మరోవైపు హిందీలో ఆయుష్మాన్ ఖురానాతో డాక్టర్ జీ సినిమాలో నటిస్తోంది.
ఈ భామ బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహాం (John Abraham) తో అటాక్ చిత్రం చేస్తోంది. తమిళ హీరో శివకార్తికేయన్ నటిస్తోన్న అయలాన్ లో ఫీమేల్ లీడ్ రోల్ చేస్తోంది. కమల్ హాసన్-శంకర్ ల ప్రాజెక్టు ఇండియన్ 2 చేస్తోంది.
Rakul Preet Singh | ఎవరికీ తెలియని రకుల్ గ్లామర్ సీక్రెట్ ఇదేనా..?
Manoj Bajpayee: మరో విషాదం.. మనోజ్ బాజ్‌పేయ్ తండ్రి మృతి
Mahesh: స్పెయిన్ షెడ్యూల్ ప్లాన్ చేసిన సర్కారు వారి పాట టీం..!
Chiranjeevi | గర్వంగా చెబుతున్నా అది నా సొంత డబ్బు: చిరంజీవి