బుధవారం 28 అక్టోబర్ 2020
Cinema - Sep 03, 2020 , 23:49:00

ఆ క్షణాలు గుర్తొచ్చాయి

ఆ క్షణాలు గుర్తొచ్చాయి

సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి సెట్స్‌లో అడుగుపెట్టింది రకుల్‌ప్రీత్‌సింగ్‌. కొద్ది మాసాలుగా దూరమైన షూటింగ్‌ సరదాల్ని తిరిగి ఆస్వాదిస్తోంది. ఇటీవలే ఆమె క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా చిత్రీకరణలో భాగమైంది.  పంజా వైష్ణవ్‌తేజ్‌   కథానాయకుడిగా నటిస్తున్నారు. ప్రస్తుతం వికారాబాద్‌ అడవుల్లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. నాయకానాయికలపై కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. ‘తిరిగి సెట్స్‌లో అడుగుపెట్టే సమయం కోసం ఎంతగానో ఎదురుచూశా. నా నిరీక్షణ ఫలించింది. తొలిసారి సెట్స్‌లో అడుగుపెట్టిన క్షణాలు మళ్లీ గుర్తొచ్చాయి’ అంటూ రకుల్‌ ఆనందం వ్యక్తం చేసింది. ఫారెస్ట్‌ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే కథ ఇది. నలభై రోజుల పాటు ఏకధాటిగా జరిగే సింగిల్‌ షెడ్యూల్‌లో షూటింగ్‌ను పూర్తిచేయనున్నారు.


logo