శుక్రవారం 22 జనవరి 2021
Cinema - Nov 23, 2020 , 10:50:46

అండ‌ర్ వాట‌ర్ ర‌కుల్ అడ్వెంచ‌ర్స్...!

అండ‌ర్ వాట‌ర్ ర‌కుల్ అడ్వెంచ‌ర్స్...!

భూత‌ల స్వ‌ర్గం మాల్దీవులలో అందాల భామ‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నారు. కాజ‌ల్ అగ‌ర్వాల్, ప్ర‌ణీత‌, దిశా ప‌టానీ, స‌మంత‌లు మాల్దీవుల‌ని చుట్టేస్తూ అక్క‌డి అందాల‌ను కెమెరాలో బంధిస్తున్నారు. అంతేకాక సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కు థ్రిల్ అందిస్తున్నారు. పంజాబీ సోయ‌గం ర‌కుల్ ప్రీత్ సింగ్ త‌న త‌ల్లిదండ్రుల 31వ యానివ‌ర్స‌రీని జ‌రిపేందుకు ఫ్యామిలీతో మాల్దీవుల‌కి వెళ్లింది. అక్క‌డ ఫ్యామిలీతో ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ అండ‌ర్ వాట‌ర్‌లో అడ్వెంచ‌ర్స్ చేస్తుంది.

తాజాగా ర‌కుల్ అండ‌ర్ వాట‌ర్‌లో చేసిన సాహ‌సానికి సంబంధించిన ఫొటో షేర్ చేసింది. నీటి అడ‌గున ప్ర‌పంచం చూస్తుంటే ఎంతో ఆనందం క‌లుగుతుంది.సముద్రం అడుగు భాగం ఎంత అందంగా ఉంది. దీని గురించి మ‌న‌కు కొంతే తెలుసు. చూస్తుంటే చాలా ఆశ్చ‌ర్యం వేసింద‌ని ర‌కుల్ త‌న కామెంట్‌లో పేర్కొంది. న‌వంబ‌ర్ 24న ఈ ముద్దుగుమ్మ ముంబైకి తిరిగి రానుండ‌గా, ఆ త‌ర్వాత అజ‌య్ దేవ‌గ‌ణ్ దర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న మేడే అనే సినిమాలో న‌టిస్తుంది. 


logo