బుధవారం 28 అక్టోబర్ 2020
Cinema - Sep 24, 2020 , 11:52:43

రేపు ర‌కుల్ విచార‌ణ: ఎన్సీబీ

రేపు ర‌కుల్ విచార‌ణ: ఎన్సీబీ

హైద‌రాబాద్‌:  బాలీవుడ్ డ్ర‌గ్ కేసులో హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్‌కు ఎన్సీబీ స‌మ‌న్లు జారీ చేసిన విష‌యం తెలిసిందే. వాస్త‌వానికి ఇవాళ ముంబైలో ఎన్సీబీ ఎదుట ఆమె హాజ‌రు కావాల్సి ఉన్న‌ది. కానీ ఆమె ఇవాళ విచార‌ణ‌కు హాజ‌రుకావ‌డం లేదు. తాము జారీ చేసిన స‌మ‌న్లుకు ర‌కుల్ స్పందించింద‌ని, త‌న అడ్ర‌స్‌ను కూడా అప్‌డేట్ చేసిన‌ట్లు కాసేప‌టి క్రితం ఎన్సీబీ అధికారులు వెల్ల‌డించారు.  ర‌కుల్‌కు బుధ‌వార‌మే స‌మ‌న్లు ఇచ్చామ‌ని, వివిధ ప‌ద్ధ‌తుల్లో ర‌కుల్‌ను క‌లిసేందుకు ప్ర‌య‌త్నించామ‌ని, కానీ ఆమె స్పందించ‌లేద‌ని తొలుత‌ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో పేర్కొన్న‌ది. కానీ శుక్ర‌వాం ఆమె విచార‌ణ‌కు హాజ‌ర‌య్యే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఎన్సీబీ అధికారులు చెప్పారు. మ‌రో హీరోయిన్ దీపికా ప‌దుకొనే మేనేజ‌ర్ క‌రిష్మా ప్ర‌కాశ్‌.. ఎన్సీబీ ముందు హాజ‌ర‌య్యేందుకు ఈనెల 25వ తేదీ వ‌ర‌కు మిన‌హాయింపు ఇవ్వాల‌ని కోరారు. 

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో డ్ర‌గ్స్ కోణాన్ని విచారిస్తున్న ఎన్సీబీ అధికారులు ప‌లువురు హీరోయిన్ల‌కు నిన్న స‌మ‌న్లు జారీ చేశారు. ఆ జాబితాలో ర‌కుల్‌, దీపిక‌తో పాటు శ్ర‌ద్ధాక‌పూర్‌, సారా అలీఖాన్‌లు ఉన్నారు.  సుశాంత్ కేసులో అరెస్టు అయిన రియా చ‌క్ర‌వ‌ర్తితో జ‌రిపిన వాట్సాప్ చాటింగ్ ద్వారా బాలీవుడ్ హీరోయిన్లు డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు తేలింది. అయితే ర‌కుల్ ప్రీత్ మాత్రం త‌న‌కు స‌మ‌న్లు అంద‌లేద‌ని చెప్పింది.  కానీ ఎన్సీబీ అధికారులు మాత్రం ర‌కుల్ త‌మ‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్న‌ట్లు పేర్కొన్నారు.   ర‌కుల్ ప్రీత్ ఎక్క‌డ ఉందో తెలియ‌ద‌ని, హైద‌రాబాద్‌లోనా లేక ముంబైలో ఉన్న‌ట్లు తెలియ‌డం లేద‌ని, కానీ ఆమె వాట్సాప్‌కు నోటీసులు పంపిన‌ట్లు ఎన్సీబీ వెల్ల‌డించింది.  

ఎన్సీబీ అధికారులు ఇవాళ ర‌కుల్ ప్రీత్‌కు రెండ‌వ సారి స‌మ‌న్లు జారీ చేయాల‌‌నున్నారు. ఒక‌వేళ ఆ స‌మ‌న్ల‌ను ర‌కుల్ విస్మ‌రిస్తే ఆమెను నాన్ బెయిల‌బుల్ వారెంట్ కింద అరెస్టు చేసే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తొలుత పేర్కొన్నారు.


logo