ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Cinema - Aug 05, 2020 , 10:54:12

హీరోల‌ని మించి ఫాలోవ‌ర్స్ సొంతం చేసుకున్న ర‌కుల్

హీరోల‌ని మించి ఫాలోవ‌ర్స్ సొంతం చేసుకున్న ర‌కుల్

ఢిల్లీ బ్యూటీ ర‌కుల్ ప్రీత్ సింగ్ హ‌వా ప్ర‌స్తుతం తెలుగులో కొంత త‌గ్గిన‌ప్ప‌టికి ఒకానొక టైంలో దుమ్ము రేపింది. స్టార్ హీరోలంద‌రి సినిమాల‌లో క‌థానాయిక‌గా న‌టించి అల‌రించింది. తెలుగులోనే కాక త‌మిళం, హిందీ భాష‌ల‌లోను న‌టిస్తుంది. ప్ర‌స్తుతం ఇండియన్ 2, నితిన్ సినిమాల‌లో న‌టించ‌నుంది. అయితే ఈ అమ్మ‌డి ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవ‌ర్స్ సంఖ్య 15 మిలియ‌న్స్‌కి చేరుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ర‌కుల్ ప్రీత్ సింగ్ త‌న‌కి సంబంధించి అప్‌డేట్స్ ఎప్ప‌టిక‌ప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ఉంటుంది. ఈ వ‌ర్క్‌, స్కిల్స్‌, ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇలా పలు విష‌యాల‌కి సంబంధించి సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేస్తుంది. ఈ క్ర‌మంలో ర‌కుల్ ప్రీత్ ఫాలోవ‌ర్స్ సంఖ్య 15 మిలియ‌న్స్‌కి చేరుకుంది. ఈ సంద‌ర్బంగా ఓ వీడియో ద్వారా త‌న ఫాలోవ‌ర్స్‌కి కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది. 

సోష‌ల్ మీడియా గురించి పెద్ద‌గా తెలియ‌కుండానే ప‌ని ప్రారంభించాను. కానీ మీరందరూ నాకు మద్దతునిచ్చారు . నాపై అపారమైన ప్రేమను చూపించారు, దాని కోసం నేను ఎప్పటికీ కృతజ్ఞతతో ఉన్నాను. మీ అందరినీ అలరించడానికి కృషి చేస్తానని నేను వాగ్దానం చేస్తున్నాను అని ర‌కుల్ పేర్కొంది. స్టార్ హీరోలు ప్ర‌భాస్‌, అల్లు అర్జున్, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, మ‌హేష్ ల క‌న్నా కూడా ర‌కుల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ మంది ఫాలోవ‌ర్స్‌ని సొంతం చేసుకోవ‌డం విశేషం.logo