సోమవారం 18 జనవరి 2021
Cinema - Dec 01, 2020 , 13:11:52

ర‌కుల్ సినిమాలు ఓటీటీలోనా..!

ర‌కుల్ సినిమాలు ఓటీటీలోనా..!

టాలెంట్ క‌న్నా అదృష్టంతోనే ఎక్కువ‌గా దూసుకెళుతుంది ర‌కుల్ ప్రీత్ సింగ్.  ఈ అమ్మ‌డి చేతిలో ప్ర‌స్తుతం చెక్, వైష్ణవ్ తేజ్ స‌ర‌స‌న ఓ చిత్రం, జాన్ అబ్ర‌హంతో ఒక‌టి, అర్జున్ క‌పూర్‌తో మ‌రో చిత్రం చేస్తుంది. ఇవే కాక అమితాబ్ బ‌చ్చ‌న్- అజ‌య్ దేవ‌గ‌ణ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్క‌నున్న మేడే చిత్రంలోను ముఖ్య పాత్ర పోషిస్తుంది.  ఈ అమ్మ‌డి చేతిలో రెండు త‌మిళ సినిమాలు కూడా ఉన్నాయి. ఈ సినిమాల‌కు సంబంధించి ఆమె మేనేజ‌ర్ ఇటీవ‌ల అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

ర‌కుల్ న‌టించిన రెండు తెలుగు సినిమాలు,ఒక హిందీ చిత్రం ఓటీటీలో విడుద‌ల కానున్న‌ట్టు తెలుస్తుంది.  క్రిష్ దర్శ‌ కత్వంలో తెరకెక్కుతున్న చిత్రం, నితిన్ స‌ర‌స‌న న‌టిస్తున్న చెక్ మూవీ,  అర్జున్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రాలు ఓటీటీలో విడుద‌ల అయ్యేందుకు సిద్దంగా ఉన్నాయ‌ని టాక్. రకుల్  న‌టిస్తున్న మూడు సినిమాలు ఓటీటీకే పరిమితం కావడంతో  పెద్ద‌తెర‌పై త‌మ అభిమాన హీరోయిన్‌ని చూడ‌లేమ‌ని అభిమానులు ఆవేద‌న చెందుతున్నారు. కాగా, గ‌త కొద్ది రోజులుగా మాల్దీవుల‌లో ఎంజాయ్ చేస్తున్న ర‌కుల్ వాటికి సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ని ఉత్సాహ‌ప‌రుస్తుంది.