మంగళవారం 20 అక్టోబర్ 2020
Cinema - Sep 12, 2020 , 18:48:26

షూటింగ్ ఆపేసి కంగారుగా వెళ్లిపోయిన ర‌కుల్‌.. కార‌ణం అదేనా!

షూటింగ్ ఆపేసి కంగారుగా వెళ్లిపోయిన ర‌కుల్‌.. కార‌ణం అదేనా!

ప్ర‌స్తుతం చిత్ర ప‌రిశ్ర‌మను డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం కుదిపేస్తున్న‌ది. సుశాంత్ రాజ్‌పుత్‌‌ మ‌రణం కార‌ణంగా కొన్నిరోజుల నుంచి కేసులు న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంలో రియా  చ‌క్ర‌వ‌ర్తి ఎన్‌సీబీ అధికారుల‌కు మొత్తం 25 పేర్లు వెల్ల‌డించింది. వారిలో ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టి సారాతో పాటు టాలీవుడ్ అందాల బామ ర‌కుల్ ప్రీత్ సింగ్‌ పేర్లు ఉండ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. కాగా.. ప్ర‌స్తుతం ర‌కుల్ సినిమా షూటింగ్ కోసం మూడు రోజుల ముందు హైద‌రాబాద్‌కు వ‌చ్చింది.

వికారాబాద్‌లో షూటింగ్ న‌డుస్తుండ‌గా అర్థాంత‌రంగా వెళ్లిపోయింది. అందుకు కార‌ణం రియా డ్ర‌గ్స్ కేసులో త‌న పేరు ఉండ‌డ‌మే. మీడియాలో ర‌కుల్ పేరు మారుమోగిపోతుండ‌డంతో షూటింగ్‌ను ఆపేసి అక్క‌డి నుంచి వెళ్లిపోయింది. ఈ వీడియోలో ర‌కుల్ పళ్లెటూరి అమ్మాయి గెట‌ప్‌లో గొర్రెల కాప‌రిగా క‌నిపిస్తుంది. రియా వెల్లడించిన యాక్టర్లందరికీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు త్వరలోనే నోటీసులు జారీ చేయనున్నారు. సుశాంత్ కేసు ఇంకెన్ని విధాలుగా మ‌లుపు తిరుగుతుందో చూడాలి.


logo