శనివారం 30 మే 2020
Cinema - May 07, 2020 , 12:15:16

ర‌కుల్ చేతిలో మందు బాటిల్స్‌..వీడియో వైర‌ల్‌!

ర‌కుల్ చేతిలో మందు బాటిల్స్‌..వీడియో వైర‌ల్‌!

డిజిట‌ల్ యుగంలో సోష‌ల్ మీడియా ప్రాముఖ్య‌త చాలా పెరిగింది. ప్రతి ఒక్క‌రు సోష‌ల్ మీడియా అకౌంట్స్ మొయింటైన్ చేయ‌డంతో పాటు అందులో ప్ర‌పంచంలో జ‌రిగే అన్నీ విష‌యాల‌ని ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్ చేస్తున్నారు. అయితే కొంద‌రు అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శిస్తూ త‌ప్పుడు విష‌యాల‌ని కూడా నిజం అనేలా ప్ర‌చారం చేస్తూ నెటిజ‌న్స్‌ని అయోమయానికి గురి చేస్తున్నారు.

తాజాగా అందాల భామ ర‌కుల్ ప్రీత్ సింగ్ ముంబై లోని బాంద్రాలో ఉన్న మెడిక‌ల్ షాపు కి వెళ్లి మందులు తీసుకొని రోడ్డు దాటుతుండ‌గా, ఎవ‌రో వీడియో తీసి సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. కాని కొంద‌రు ఆక‌తాయిలు ర‌కుల్ చేతిలో ఉన్న‌వి లిక్క‌ర్ బాటిల్స్ అంటూ ప్ర‌చారం మొద‌లు పెట్టారు. దీనిపై ర‌కుల్ అభిమానులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు.  మెడిక‌ల్ షాపు ఎదురుగా క‌నిపిస్తున్న‌ప్ప‌టికీ, త‌ప్పుడు ప్ర‌చారం ఎలా చేయాల‌నిపిస్తుంద‌ని ఫైర్ అయ్యారు. logo