మంగళవారం 01 డిసెంబర్ 2020
Cinema - Oct 31, 2020 , 13:23:02

త‌న పార్ట్ షూటింగ్ పూర్తి కావ‌డంతో స్టాఫ్‌తో ర‌కుల్ సెల‌బ్రేష‌న్స్

త‌న పార్ట్ షూటింగ్ పూర్తి కావ‌డంతో స్టాఫ్‌తో ర‌కుల్ సెల‌బ్రేష‌న్స్

పంజాబీ ముద్దుగుమ్ము ర‌కుల్ ప్రీత్ సింగ్ ఇటీవ‌లి కాలంలో తెలుగు సినిమాలు చాలా త‌గ్గించింది. కేవ‌లం త‌మిళ మూవీస్‌తో బిజీబిజీగా గడుపుతుంది. అడ‌పాద‌డపా హిందీ సినిమాలు చేస్తుంది. అయితే క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో మెగా హీరో వైష్ణ‌వ్ తేజ్ హీరోగా తెర‌కెక్కుతున్న చిత్రానికి గాను ర‌కుల్ క‌థానాయికగా ఎంపిక కాగా, ఈమెకు సంబంధించిన షూటింగ్ పార్ట్ రీసెంట్‌గా పూర్తైంది.

కరోనా స‌మ‌యంలోను స‌క్సెస్‌ఫుల్‌గా షూటింగ్ పూర్తి చేసినందుకు ఆ సంతోషాన్ని త‌న స్టాఫ్‌తో క‌లిసి సెల‌బ్రేట్ చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియోని ర‌కుల్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ఒక‌రికొక‌రు కేక్‌ని తినిపించుకుంటున్నారు. అయితే షూటింగ్ పూర్తైన త‌ర్వాత అంద‌రం టెస్ట్‌లు చేయించుకోగా,  నెగెటివ్ రావ‌డంతో మాస్క్‌లు లేకుండా సెల‌బ్రేట్ చేసుకున్నాం అని ర‌కుల్ పేర్కొంది.