బుధవారం 03 జూన్ 2020
Cinema - Apr 27, 2020 , 14:31:50

ర‌కుల్‌కి లాక్‌డౌన్ క‌ష్టాలు..!

ర‌కుల్‌కి లాక్‌డౌన్ క‌ష్టాలు..!

ఒక‌ప్పుడు వ‌రుస ఆఫ‌ర్స్‌తో బిజీ హీరోయిన్‌గా ఉన్న ర‌కుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు ఆఫ‌ర్స్ లేక దిగాలుగా ఉంది. దీపం ఉన్న‌ప్పుడే ఇల్లు చక్క‌బెట్టుకోవాల‌నే పాల‌సీని గ‌ట్టిగా న‌మ్మిన ర‌కుల్ సినిమా ఆఫ‌ర్స్‌తో ఫుల్ బిజీగా ఉన్న స‌మ‌యంలో హైదరాబాద్ లో రెండు, వైజాగ్ లో ఒకటి జిమ్ సెంటర్ ను ఏర్పాటు చేసింది. వీటికి జ‌నాల తాకిడి బాగానే ఉండేది. కాని ఇప్పుడు లాక్ డౌన్ వ‌ల‌న పూర్తిగా బోసిపోయాయి.

లాక్‌డౌన్ వ‌ల‌న సినిమా షూటింగ్స్ ఎప్పుడు మొద‌ల‌వుతాయో తెలియ‌ని పరిస్థితి. ఒక‌వేళ మొద‌లైన కూడా పెద్ద‌గా ఆఫ‌ర్స్ లేని ర‌కుల్ నాలుగు కాసులు వేసుకోవ‌డం క‌ష్టం. మ‌రోవైపు తన బిజినెస్‌లు కూడా ఇప్ప‌ట్లో లాభాలబాట ప‌ట్ట‌డం అనేది అసాధ్యం. మరి ఇలాంటి పరిస్థితుల‌లో ర‌కుల్ త‌న ద‌గ్గ‌ర ప‌ని చేసే ఉద్యోగుల‌కి జీతాలు ఎలా ఇస్తుంది, త‌న భ‌విష్య‌త్‌ని ఎలా ముందుకు న‌డిపిస్తుంద‌నేది ప్ర‌శ్నార్ధ‌కంగా మారింది.


logo