శుక్రవారం 30 అక్టోబర్ 2020
Cinema - Oct 11, 2020 , 10:23:26

ర‌కుల్ బ‌ర్త్ డే పార్టీ.. వీడియో వైర‌ల్

ర‌కుల్ బ‌ర్త్ డే పార్టీ.. వీడియో వైర‌ల్

గ్లామ‌ర్ బ్యూటీ ర‌కుల్ ప్రీత్ సింగ్ అక్టోబ‌ర్ 10,2020న 30వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఆమెకు అభిమానులు, శ్రేయోభిలాషులు, పలువురు ప్ర‌ముఖులు ట్విట్ట‌ర్ ద్వారా శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ఇలాంటి పుట్టిన రోజు మరెన్నో పుట్టిన రోజులు జ‌రుపుకోవాల‌ని చెప్పారు. క‌ట్ చేస్తే ర‌కుల్ త‌న బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఇంటి పైన‌ గ్రాండ్ పార్టీని ఏర్పాటు చేసిన‌ట్టు తెలుస్తుంది. మంచు ల‌క్ష్మీ కూడా పార్టీకి హాజ‌రు కాగా త‌న సోష‌ల్ మీడియాలో వీడియోని షేర్ చేసింది.

ఈ వీడియోలో ర‌కుల్‌.. మంచు లక్ష్మిని ఆప్యాయంగా వెనకనుంచి హ‌త్తుకున్న‌ట్టు కనిపిస్తుంది. చుట్టు ప‌క్క‌ల కూడా చాలా మంది ఫ్రెండ్ ఉన్న‌ట్టు వీడియో ద్వారా అర్ధ‌మ‌వుతుంది. మంచు ల‌క్ష్మీ త‌న పోస్ట్‌లో ర‌కుల్ .. నిజాయితీ గల హార్డ్ వర్కర్, ఫన్, కేరింగ్, మ్యాడ్ ఫ్రెండ్, హ్యాపీ బర్త్ డే మై లవ్. నువ్వు ఎవరి లైఫ్‌ని టచ్ చేసినా హ్యాపీగా ఉంటారు అని కామెంట్ పెట్టింది. దీనికి స్పందించిన ర‌కుల్‌..  'లవ్యూ.. నువ్వు నా సోదరి. నా సోల్. నువ్వు నాతో ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. చీర్స్..' అని పేర్కొంది.